AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విచ్ బోర్డులో ఈ రెడ్ లైట్ ఎందుకుంటుంది..? వావ్.. ఎన్ని ఉపయోాగాలు ఉన్నాయో తెలుసా..?

స్విచ్ బోర్డులు పరిశీలిస్తే.. అందులో ఒక లైట్ ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఇది ఏదో సాాధారణ లైట్ అని, పెద్దగా దాని వల్ల అవసరం ఉండదని అనుకుంటారు. కానీ ఈ లైట్ వెనుక అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇంట్లో పవర్ సప్లై ఉందో లేదో తెలుసుకోవచ్చు.

స్విచ్ బోర్డులో ఈ రెడ్ లైట్ ఎందుకుంటుంది..? వావ్.. ఎన్ని ఉపయోాగాలు ఉన్నాయో తెలుసా..?
Light
Venkatrao Lella
|

Updated on: Jul 20, 2026 | 4:05 PM

Share

ప్రతీ ఇంట్లో స్విచ్ బోర్డులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇంట్లో కరెంట్ ఉన్నప్పుడు స్విచ్ బోర్డుల్లో ఎల్లప్పుడూ చిన్న ఎరుపు లేదా నారింజ రంగు లైటు వెలుగుతూ ఉంటుంది. సాధారణ అలంకరణలో భాగంగా ఇది ఉందని మీరు అనుకుంటే పొరపడినట్లు. కానీ అది కేవలం ఒక లైటు మాత్రమే కాదు. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇంట్లో విద్యుత్ సరఫరా ఉందో లేదో ఇది సులువుగా తెలియచేస్తుంది. అంతేకాకుండా ఇంటి విద్యుత్ భద్రతను నిర్ధారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిని ఇండికేటర్ లైట్ అని అంటారు. పేరుకు తగ్గట్టుగానే.. ఇది విద్యుత్ సరఫరాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తుంది.

ఇండికేటర్ లైట్

ఈ ఇండికేటర్ లైట్ నేరుగా మెయిన్ పవర్ లైన్ లేదా మెయిన్ స్విచ్‌కు అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి ఇంట్లోని ఫ్యాన్, లైట్, టీవీ లేదా ఇతర విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ.. ఇంటికి విద్యుత్ సరఫరా ఉన్నంత వరకు ఈ లైట్ వెలుగుతూనే ఉంటుంది. మొత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఒక సూచికగా పనిచేస్తుంది. ఆధునిక స్విచ్‌బోర్డులలో ఉండే నియాన్ దీపాలు లేదా LED ఇండికేటర్లను ఉపయోగిస్తుంది. ఇవి చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఇవి గ్యాస్ డిశ్చార్జ్ టెక్నాలజీ లేదా LED టెక్నాలజీపై ఆధారపడి ఉండటం వల్ల ఈ లైట్ సులభంగా వేడెక్కదు. అందుకే చాలా కాలం పాటు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో వీటి నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇన్వర్టర్లు ఉన్న ఇళ్లలో ఈ సూచిక లైట్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

కరెంట్ వినియోగం తక్కువే..

కొన్ని స్విచ్‌బోర్డులలో రెండు వేర్వేరు రంగుల సూచిక దీపాలు ఉంటాయి. ఒకటి మెయిన్స్ విద్యుత్ సరఫరా ఆన్‌లో ఉందని సూచిస్తే.. మరొకటి ఇల్లు ప్రస్తుతం ఇన్వర్టర్ విద్యుత్‌తో నడుస్తోందని సూచిస్తుంది. దీనివల్ల విద్యుత్ ఎక్కడి నుండి వస్తుందో సులభంగా కనిపెట్టవచ్చు. మీ ఇంట్లో వోల్టేజ్ ఎలా ఉందో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. వోల్డేజ్ తక్కువగా ఉంటే ఈ లైట్ మసకగా కనిపిస్తుంది. వోల్టేజ్ సాధారణంగా ఉంటే ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఈ లైట్ నిరంతరం వెలుగుతూ ఉండటం వల్ల విద్యుత్ బిల్లు చాలా ఎక్కువగా వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఈ లైట్ కేవలం 0.2 నుండి 0.5 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. ఇది సంవత్సరమంతా 24 గంటలూ వెలిగి ఉన్నప్పటికీ.. మొత్తం మీద 1 నుండి 2 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. ఫలితంగా, విద్యుత్ బిల్లుపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లైట్ వెలిగి ఉండటం వల్ల అదనపు ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Follow Us