Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastag Balance : ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో? తెలియడం లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో క్షణాల్లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

సొంత వాహనాలతో వచ్చేవారికి టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ కట్టాలి. అలాంటి వారు తమ ఫాస్ట్ ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో? తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు రద్దీగా ఉండే హైవేపై ప్రయాణిస్తుంటే మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడానికి సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరి.

Fastag Balance : ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో? తెలియడం లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో క్షణాల్లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు
Fastag
Follow us
Srinu

|

Updated on: Mar 10, 2023 | 4:00 PM

ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్‌తో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి టోల్ ప్లాజా వద్ద టోల్‌ను వసూలు చేస్తుంది. ప్రభుత్వం, భాగస్వామ్య బ్యాంకులు అధికారం పొందిన అధికారిక ట్యాగ్ జారీదారులు ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేయవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్‌ పొందడం కోసం కనీస రీఛార్జ్ మొత్తం రూ. 100గా ఉంది. అయితే గరిష్ట మొత్తం వాహనం రకం, ఫాస్ట్‌ట్యాగ్ సేవకు లింక్ చేయబడిన ఖాతాపై ఆధారపడి ఉంటుంది. కస్టమర్‌లు తమ ఖాతాలకు డబ్బును జోడించడానికి ప్రయత్నించినప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ ప్రారంభంలో కొన్ని అవాంతరాలను ఎదుర్కొన్నప్పటికీ, ఈ ప్రక్రియ చివరికి సజావుగా సాగుతుంది. అయితే ఎప్పుడూ ప్రయాణించే వారు ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌పై ఓ అంచనా ఉంటుంది. అదే అవసరం కొద్దీ సొంత వాహనాలతో వచ్చేవారికి టోల్ ప్లాజా దాటాలంటే కచ్చితంగా టోల్ కట్టాలి. అలాంటి వారు తమ ఫాస్ట్ ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో? తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు రద్దీగా ఉండే హైవేపై ప్రయాణిస్తుంటే మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడానికి సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరి. క్షణాల్లో మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ మీ ముందు ఉంటుంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానం

సులభమైన మార్గాల్లో మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐడీని సృష్టించి, మీ బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని సింపుల్‌గా తనిఖీ చేయవచ్చు. లాగిన్ అయిన తర్వాత, మీరు మీ మిగిలిన ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి వ్యూ ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఎంపికపై క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది.

ఎన్‌హెచ్ఏఐ యాప్ ద్వారా

మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో లేదా యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న మై ఫాస్ట్ ట్యాగ్ యాప్‌లో మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాకు సంబంధించిన వివరాలను తనిఖీ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మిస్డ్ కాల్‌తో..

మిస్డ్ కాల్ అలర్ట్ ఫెసిలిటీ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 88843 33331కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. అనంతరం మీ ఫోన్‌లో ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌తో నోటిఫికేషన్‌ను అందుకుంటారు.

ఫాస్ట్‌ట్యాగ్ రీచార్జ్ ఇలా..

మీరు మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా పేటీఎం, జీపే లేదా ఫోన్‌పే వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌లను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాను రీఛార్జ్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..