SBI: ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ కొత్త సేవలు.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు, ఆ వివరాలు ప్రత్యక్షం..
SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన ఖాతాదారుల కోసం కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైవేలపై ప్రయణించే వారు కచ్చితంగా...
SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన ఖాతాదారుల కోసం కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైవేలపై ప్రయణించే వారు కచ్చితంగా ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందరూ ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తున్నారు. టోల్‌గేట్స్ వద్ద వాహనాలు ఎక్కువ సమయంలో క్యూ కట్టకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ ఉపయోగిస్తున్న ఖాతాదారుల కోసం కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక మెసేజ్‌తో ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే సర్వీస్‌ను లాంచ్ చేసింది. ఫాస్ట్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లు రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7208820019 నెంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు వెంటనే బ్యాలెన్స్ ఎంత ఉందో తెలిసిపోతుంది.
Dear SBI FASTag Customer, send an SMS to 7208820019 from your registered mobile number to quickly know your SBI FASTag balance. #SBIFastag #SBI #AmritMahotsav pic.twitter.com/mDQQgDl7Mv
— State Bank of India (@TheOfficialSBI) September 10, 2022
ఎలా మెసేజ్ చేయాలంటే..
ఇందుకోసం ముందుగా FTBAL అని టైప్ చేసి వాహనం నెంబర్ (ఒకవేళ ఒకే నెంబర్‌పై ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు ఉంటే) ఎంటర్ చేయాలి. అనంతరం మెసేజ్‌ను 7208820019 నెంబర్‌కి మెసేజ్ పంపించాలి. వెంటనే ఫోన్‌కు మెసేజ్ రూపంలో ఫాస్టాగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..