WhatsApp: మీకు +92, +82, +62 వంటి నంబర్ల నుంచి వాట్సాప్‌లో కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
వాట్సాప్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో మోసాలకు పాల్పడేవారు వాట్సాప్ కాల్స్ చేస్తూ వినియోగదారున్ని చిక్కుల్లో పడేస్తున్నారు. కొన్ని కోడ్‌లతో వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సంస్థ హెచ్చరిస్తోంది. మేము వినియోగదారులకు భద్రతను అందించడానికి కట్టుబడి ఉన్నామని వాట్సాప్ సంస్థ తెలిపింది. దీని కోసం మేము AI, ఇతర సాంకేతికతల సహాయం తీసుకుంటున్నాము. మార్చి నెలలో కంపెనీ 47 లక్షల ఖాతాలను మూసివేసింది.
సాంకేతికత అన్నింటిని సులభతరం చేస్తున్నప్పటికీ మోసాల సంఘటనలు భారీగా పెరిగాయి. ఆన్‌లైన్ ద్వారా మోసాలు జరుగుతుండటంతో స్థానిక పోలీసులు సైతం నిస్సహాయంగా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం వల్ల అసమర్థత కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ మనకు ఏదైనా తప్పు జరగకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుంచి కాల్స్ ఎక్కువయ్యాయి. వారి నంబర్ ఎలా వచ్చిందని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ కాల్స్ ఇండియా నుంచి కాకుండా ఇతర దేశాల కోడ్‌లతో రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది వర్చువల్ నంబర్ల ద్వారా ప్రజలను మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
+92, +82, +62 కోడ్ నుంచి ప్రతి రెండు రోజులకు ఫోన్‌లు వస్తున్నాయి. అందుకే వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. కొన్ని రోజుల క్రితం ఒక వినియోగదారుకు +92 నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఐఫోన్ 14ను ఉచితంగా గెలుచుకోవడం గురించి చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఇచ్చిన ఆఫర్‌లో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో చివరకు పోలీసులకు పరుగు తప్ప మరో మార్గం లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. అలాంటి కాల్స్‌ను బ్లాక్ చేయాలని వాట్సాప్ సూచించింది.
ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి?
దీని గురించి సమాచారం ఇస్తూ, మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా నుంచి వినియోగదారులకు ISD కాల్స్ వస్తున్నాయని వాట్సాప్ తెలిపింది. అయితే, ఈ కాల్‌ల వెనుక అసలు విషయం ఏమిటో స్పష్టంగా తెలియరాలేదు. కానీ ఈ పద్ధతి ద్వారా మోసం చేసే అవకాశం ఎక్కువ. అంతేకాదు కొన్ని సెకన్లలో కాల్స్ కట్ అవుతున్నాయి. మళ్లీ కాల్ చేసే వలలో పడకండి. లేదంటే మోసం జరగవచ్చు.
తెలియని కాల్‌లను ఎలా బ్లాక్ చేయాలి?
మేము వినియోగదారులకు భద్రతను అందించడానికి కట్టుబడి ఉన్నామని వాట్సాప్ సంస్థ తెలిపింది. దీని కోసం మేము AI, ఇతర సాంకేతికతల సహాయం తీసుకుంటున్నాము. మార్చి నెలలో కంపెనీ 47 లక్షల ఖాతాలను మూసివేసింది. అదే సమయంలో కంపెనీ తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్‌లను నివారించడానికి ఒక ఫీచర్‌ను అందించింది.
తెలియని కాల్స్ రాకుండా ఏం చేయాలి?
వాట్సాప్‌ని ఓపెన్ చేసి దాని Settingలోకి వెళ్లండి. అక్కడ Privacyని క్లిక్ చేయండి. ఆ తర్వాత Callsను ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత Silence unknown callersలో ఇచ్చిన టోగుల్‌ని ఆన్ చేయండి. అది గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇలాంటి గుర్తు తెలియని కాల్స్‌ను నివారించవచ్చని వాట్సాప్ తెలిపింది.