AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat Gpt Services: ఇలా చేస్తే మీ మొబైల్ లోనే చాట్ బాట్ సేవలు.. వాట్సాప్ తో లింక్ చేసుకోండిలా..!

వాట్సాప్ ఖాతాతో చాట్ బాట్ ను అనుసంధానించుకుంటే మరింత వేగంగా దాన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే వాట్సాప్ కు చాట్ బాట్ అనుసంధానించడానికి అఫిషియల్ యాక్సెస్ లేదని గుర్తుంచుకోవాలి. అయితే కొన్ని ఇతర మార్గాల ద్వారా వాట్సాప్ ఖాతాకు చాట్ బాట్ సేవలు వచ్చేలా చేయవచ్చు.

Chat Gpt Services: ఇలా చేస్తే మీ మొబైల్ లోనే చాట్ బాట్ సేవలు.. వాట్సాప్ తో లింక్ చేసుకోండిలా..!
Whatsapp
Nikhil
|

Updated on: Jan 27, 2023 | 3:48 PM

Share

చాట్ జీపీటీ కొంతకాలంగా సాంకేతిక ప్రపంచంలో సందడి చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మద్దతు ఉన్న చాట్ బాట్ అనేక పరిశ్రమలకు, ఇతర రంగాలకు గో టు టూల్ గా మారింది. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ టూల్ ను మీ ఫోన్ లో పని చేసేలా చేయాలనుకుంటున్నారా? మన మొబైల్ లోని వాట్సాప్ తో దీన్ని అనుసంధానించుకోవచ్చు అని మీకు తెలుసా? వాట్సాప్ ఖాతాతో చాట్ బాట్ ను అనుసంధానించుకుంటే మరింత వేగంగా దాన్ని యాక్సెస్ చేయవచ్చు. అయితే వాట్సాప్ కు చాట్ బాట్ అనుసంధానించడానికి అఫిషియల్ యాక్సెస్ లేదని గుర్తుంచుకోవాలి. అయితే కొన్ని ఇతర మార్గాల ద్వారా వాట్సాప్ ఖాతాకు చాట్ బాట్ సేవలు వచ్చేలా చేయవచ్చు. ఇలా చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. వాట్సాప్ బాట్ ను తయారు చేసి దాన్ని చాట్ జీపీటీకి లింక్ చేయడం ఒక మార్గం. పైథాన్ స్క్రిప్ట్ ను ఉపయోగించి మీ వాట్సాప్ నెంబర్ సెట్ చేసి, ఒకేసారి చాట్ జీపీటీని ప్రారంభించడం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధుతులను ఎలా పాటించాలో ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్ చాట్ బాట్ ను సెట్ చేయడం

వాట్సాప్ బాట్‌ను నిర్మించడం కోసం వాట్సాప్ బిజినెస్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)ను రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం చాట్ కోసం ఫ్లోను సృష్టించాలి. ఆపై చాట్ డెవలపర్‌ని ఉపయోగిస్తూ చాట్‌బాట్‌ను అనుసరించాలి. తర్వాత మీ ఫోన్‌లో ఏపీఐ చాట్‌బాట్‌ను ఉంచాలి. తదుపరి దశలో మీరు ఓపెన్ ఏఐ ఏపీఐ ద్వారా ఫైల్ ఓపెన్ చేయాలి. దీని కోసం, ఓపెన్ ఏఐ ఖాతాను తయారు చేసి, దాని ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ కు సెట్ చేయాలి. అనంతరం రహస్య కీని సృష్టించాలి. మీరు సృష్టించిన వాట్సాప్ బాట్‌కి కనెక్ట్ చేయడానికి ఓపెన్ ఏఐ ఏపీఐని ఉపయోగించడం చివరి దశగా ఉంది. అయితే వాట్సాప్ ఇంటిగ్రేషన్ అసలైనదని గుర్తించకపోతే, మిమ్మల్ని బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. కాబట్టి ఈ పద్ధతి చాలా రిస్క్ తో చేయాల్సిన పని అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి దశలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 

వాట్సాప్ చాట్ బాట్ జీపీటీ ఇంటిగ్రేట్

వాట్సాప్‌తో చాట్ జీపీటిని ఇంటిగ్రేట్ చేయడానికి, టెర్మినల్‌లోని GitHub> Execute server.py నుంచి కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ జిప్ ను క్లిక్ చేయాలి. తర్వాత, టెర్మినల్‌లో వాట్సాప్ -జీపీటీ-ప్రిన్సిపల్ ఫైల్‌ను అనుమతించాలి. అనంతరం టెర్మినల్‌లో సర్వెర్.పీవై రికార్డ్‌ని అమలు చేయాలి. ఇప్పుడు ఐఎస్ తో ఎంటర్ అవ్వాలి. తర్వాత పైథాన్. సర్వర్ . పీవై ను నమోదు చేయండి. అనంతరం మీ ఫోన్ దానంతట అదే ఓపెన్ పేజీని కాన్ఫిగర్ చేస్తుంది. అనంతరం సెక్యూరిటీ చెక్ చేస్తుంది.  దీంతో వాట్సాప్ చాట్ జీపీటీ రిజిస్టర్ అవుతుంది. అనంతరం వాట్సాప్ ఖాతను ఓపెన్ చేసి, అందులో మై ఎకౌంట్ పేజికి వెళ్తే, అక్కడ ఓపెన్ ఏఐ జీపీటి ఇంటిగ్రేటెడ్‌ అని ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేయడం ద్వారా మన మొబైల్ లో చాట్ బాట్ సేవలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..