UPI Payment: ఇంటర్‌నెట్ లేకపోయినా.. యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఎలాగో తెలుసా.?
UPI Payment: డబ్బులు పంపించాలంటే ఒకప్పటిలా బ్యాంకుకు వెళ్లి క్యూలైన్‌లో నిలబడి కుస్తీలు పడాల్సిన పనిలేదు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏ పని అయినా చాలా సింపుల్‌గా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ (Smartphone) ఉంటే చాలు ఎంచక్కా...
UPI Payment: డబ్బులు పంపించాలంటే ఒకప్పటిలా బ్యాంకుకు వెళ్లి క్యూలైన్‌లో నిలబడి కుస్తీలు పడాల్సిన పనిలేదు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏ పని అయినా చాలా సింపుల్‌గా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ (Smartphone) ఉంటే చాలు ఎంచక్కా యాప్ (Apps) ఓపెన్ చేసి డబ్బులు పంపించే రోజులు వచ్చేశాయి. రకరకాల యూపీఐ (UPI) యాప్స్ అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ చాలా సులువుగా మారిపోయాయి. అయితే ఈ యాప్స్‌ను ఉపయోగించాలంటే కచ్చితంగా ఇంటర్‌నెట్ సదుపాయం ఉండాలని మనందరికీ తెలిసిందే. అయితే ఇంటర్‌నెట్ అవసరం లేకుండా కూడా యూపీఐ పేమెంట్స్ జరుపుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.? ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే సింపుల్‌గా ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే చాలు..
- స్మార్ట్ ఫోన్‌లో ముందుగా *99# అని టైప్ చేయాలి.
- వెంటనే My Profile’, ‘Send Money’, ‘Receive Money’, ‘Pending Requests’, ‘Check Balance’, ‘UPI PIN’, ‘Transactions’ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- డబ్బులు పంపాలనుకుంటే 1 నెంబర్‌ను ప్రెస్ Send Money ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- దీంతో మీ ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
- అనంతరం పేమెంట్స్ మెథడ్ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరికైతే డబ్బులు పంపించాలనుకుంటున్నారో వారి ఫోన్ నెంబర్ సెలక్ట్ చేసుకుంటే ఫోన్ నెంబర్, అకౌంట్ నెంబర్ సెలక్ట్ చేసుకుంటే అకౌంట్ నెంబర్, యుపీఐ ఐడీని ఎంచుకుంటే ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేయలాలి.
- తర్వాత ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి.
- చివరిగా మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి Send పై క్లిక్ చేస్తే నేరుగా అవతలి వారి ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి.
- అయితే ఈ విధానంలో గరిష్టంగా రూ. 5 వేలు మాత్రమే పంపించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.
Also Read: Mahaan Movie: చియాన్ విక్రమ్ యాక్షన్ థ్రిల్లర్ మహాన్.. మేకింగ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Pan Card: పాన్‌కార్డ్ పోయిందా.. మరేం పర్వాలేదు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..!
Pan Card: పాన్‌కార్డ్ పోయిందా.. మరేం పర్వాలేదు.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..!