AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car: కారులో ఏసీ ఉన్నా చల్లాగా ఉండటం లేదా..రూ. 320 లతో దీన్ని తెచ్చుకోండి.. అంతా కూల్.. కూల్..

వేసవి మొదలైన తొలి రోజు నుంచి మాడ పగిలిపోతోంది. ఏసీ కారులో వెళ్తున్నా వేడి గాలుల నుంచి తప్పించుకోలేక పోతున్నాం. ఇలాంటి సమయంలో అత్యంత తక్కువ ఖర్చుతో ఓ పరికరాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. దీని ధర కూడా కేవలం రూ.350 నుంచి మార్కెట్లో లభిస్తుంది. దీంతో మీ కారు కూల్ కూల్‌గా మారిపోతుంది.

Car: కారులో ఏసీ ఉన్నా చల్లాగా ఉండటం లేదా..రూ. 320 లతో దీన్ని తెచ్చుకోండి.. అంతా కూల్.. కూల్..
Solar Ventilation Fan
Sanjay Kasula
|

Updated on: Apr 19, 2023 | 4:47 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతోంది. బయట కాలు పెడుదామంటే సుర్రు మంటోంది. కనీసం ఏసీ కారులో బయటకు వెళ్దామంటే కూడా బయమేస్తోంది. ఎంత వేడిగా ఉంటుందో, ఒక్క క్షణం కూడా ఫ్యాన్, ఏసీ లేకుండా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇంట్లో ఏసీ ఉన్నా.. కరెంటు బిల్లును దృష్టిలో పెట్టుకుని చాలా మంది రాత్రి మాత్రమే వినియోగిస్తున్నారు. మీరు ఉదయం 8 గంటలకు రోడ్డుపైకి వస్తే.. ఇది మధ్యాహ్నం 12 గంటలా..! అన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితిలో బయట కారు డ్రైవింగ్ చేసే వారు కూడా పెట్రోలు వినియోగం గురించి ఆలోచిస్తూ నిత్యం ఏసీని వేసుకోలేక పోతున్నారు. చాలా మంది ఎప్పుడూ కారులో ఏసీ రన్ చేస్తూనే ఉంటారు. అయితే మండు ఎండలో కూడా కారులోని ఏసీ సరిగా చల్లబడకపోవడం చాలా సార్లు కనిపిస్తుంది. ఆపై మీరు కారును కాసేపు పార్క్ చేసే.. ప్రశ్న లేదు. మీరు తలుపు తెరవగానే.. కారు వేడిగా ఉందని మీకే అనిపిస్తుంది.

అయితే ఈసారి మీ సమస్య పరిష్కారం లభించనుంది. అటువంటి పరికరం గురించి మీకు తెలియజేయబడుతుంది. దీని కోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేవలం రూ. 350 ఖర్చుతో మీరు ఆ సమస్యకు పరిష్కారం దొరికించుకుంటారు. ఎక్కువ సేపు కారు పార్క్ చేసినా కారు ఏమాత్రం వేడెక్కదు.

నిజానికి ఈ పరికరం సోలార్ ఫ్యాన్. కారు కిటికీపై ఉంచడం వల్ల కారులోని వేడి బయటకు వస్తుంది. అంతే కాదు.. ఈ సోలార్ ఫ్యాన్ సహాయంతో.. కారు కేవలం కొన్ని నిమిషాల్లో చల్లబరుస్తుంది. ఫలితంగా, మీరు ఏసీని కూడా నడపాల్సిన అవసరం ఉండదు. ఉత్తమ భాగం ఏంటంటే ఈ పరికరాన్ని సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఏసీ ఆపరేషన్ సమయంలో పెట్రోల్ వినియోగిస్తున్నప్పటికీ.. ఆ ప్రతికూలత ఉండదు. ఈ సోలార్ ఫ్యాన్‌కు బ్యాటరీలు, ఇంధనం అవసరం లేదు. ఫలితంగా, ఈ చిన్న పరికరం మీ ఖర్చులను చాలా తగ్గించబోతోంది.

ఇప్పుడు ప్రశ్న ఎక్కడ కొనాలి?

మీరు ఈ సోలార్ ఫ్యాన్‌ని ఆన్‌లైన్‌లో లేదా ఆటో విడిభాగాలను విక్రయించే ఏదైనా స్టోర్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో ఈ పరికరం ధర రూ. 320 నుంచి ఇది రూ 3500ల వరకు లభిస్తుంది. మీరు మీ అవసరాలు,  బడ్జెట్ ప్రకారం కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం