Aadhar Update: ఇకపై ఫ్రీగానే ఆధార్ అప్‌డేట్.. ఎక్కడికీ వెళ్లకుండానే చేసుకోండిలా..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాలన్నా, లేకపోతే ఇన్‌కం ట్యాక్స్ కట్టాలన్నా, పిల్లలను స్కూల్లో జాయిన్ చేయించాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ఆధార్ ఐడీని జారీ చేసే ఏజెన్సీ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ డాక్యుమెంట్‌లలోని ప్రతి అప్‌డేట్ కోసం రూ. 50 వసూలు చేస్తుంది.
ప్రస్తుతం భారతదేశంలో ప్రతి అవసరానికి ఆధార్ తప్పనిసరైంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ విషయాలకు ఆధార్ ఆధారమైంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాలన్నా, లేకపోతే ఇన్‌కం ట్యాక్స్ కట్టాలన్నా, పిల్లలను స్కూల్లో జాయిన్ చేయించాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటే ఆధార్ ఐడీని జారీ చేసే ఏజెన్సీ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ డాక్యుమెంట్‌లలోని ప్రతి అప్‌డేట్ కోసం రూ. 50 వసూలు చేస్తుంది. అయితే ప్రస్తుతం యూఐడీఏఐ కి ప్రత్యేకమైన ఆఫర్ విండో కొనసాగుతోంది. ఇక్కడ ఆధార్ కార్డ్ హోల్డర్లు ఉచితంగా అప్‌డేట్‌లను పొందవచ్చు. ఈ మూడు నెలల విండో మార్చి 15న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగుతుంది. ఈ అవకాశంం వినియోగదారులు గుర్తింపు రుజువు (పీఓఐ) వంటి వివరాలను సవరించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుంది. అయితే ఈ అవకాశం ఆధార్ అప్‌డేట్ చేయని వాళ్ల కోసం రూపొందించారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రస్తుతం ఫ్రీగానే ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఉచిత సర్వీస్ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధ్రువీకృత ఆధార్ కేంద్రాల వద్ద ఈ సదుపాయం ఉండదని గమనించాలి. ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో ఓ సారి తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ ఇలా
- యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- అక్కడా ‘మై ఆధార్’ మెనుకి వెళ్లండి.
- ‘మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయండి’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆన్‌లైన్‌లో డెమోగ్రాఫిక్స్ డేటాను అప్‌డేట్ చేయి అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి కొనసాగండి క్లిక్ చేయాలి.
- అక్కడ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
- అనంతరం క్యాప్చా ధ్రువీకరించాలి.
- అక్కడ గెట్ ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- అక్కడ ‘అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా’ ఎంపిక చేసుకోవాలి.
- అప్‌డేట్ చేయడానికి వివరాల ఎంపికను ఎంచుకోండి
- ఇక్కడ కొత్త వివరాలను నమోదు చేయాలి.
- సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రూఫ్‌ను స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి.
- నమోదు చేసిన సమాచారం కచ్చితమైనదని ధ్రువీకరించాలి. దీన్ని ఓటీపీ ద్వారా చేస్తే అభ్యర్థన విజయవంతంగా ప్రాసెస్ అవుతుంది.