Ambrane Smart Watch: ఈ స్మార్ట్ వాచ్‌తో ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యం కూడా.. అతి తక్కువ ధరలోనే అద్భుత ఫీచర్లు..
ఆంబ్రేన్ మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 పేరిట వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ లో మోడరన్ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఫీచర్లను అందించింది ఆంబ్రేన్ కంపెనీ. 1.39 అంగుళాల పెద్ద స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 10 రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ వంటి సదుపాయాలను అందిస్తోంది.
అరచేతిలో స్మార్ట్ ఫోన్, మణికట్టుకు స్మార్ట్ వాచ్ లేకుండా మనిషి ముందుకు కదలడం లేదు. అంతలా వాటిపై ఆధారపడిపోయాడు మనిషి. సమాచారం మొత్తం స్మార్ట్ వాచ్ లో నిక్షిప్తం అవుతుంటే.. ఆరోగ్యానికి సంబంధించిన అద్భుత ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లు ఆకట్టుకుంటున్నాయి. అందుకే స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ కంపెనీ ఆంబ్రేన్ మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 పేరిట దీనిని ఆవిష్కరించింది. మోడరన్ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఇందులో ఫీచర్లను అందించింది ఆంబ్రేన్ కంపెనీ. 1.39 అంగుళాల పెద్ద స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 10 రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ వంటి సదుపాయాలను అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డిజైన్, లుక్.. ఈ స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాలా ఐపీఎస్ ఎల్సీడీ ల్యూసిడ్ రౌండ్ షేప్ డిస్ ప్లే ఉంటుంది. 500 నిట్స్ బ్రైట్‍నెస్ అందిస్తుంది. 240×240 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. డిస్‍ప్లే చుట్టూ బెజిల్స్ తక్కువగానే ఉన్నాయి. 100కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.
హెల్త్ ఫీచర్లు.. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, మెనుస్ట్రువల్ ట్రాకర్ వంటి హెల్త్ ఫీచర్లతో ఈ స్మార్ట్‌వాచ్ వచ్చింది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఐపీ68 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఉంటుంది. ఇది ఫిట్ నెస్, హెల్త్ పర్పస్ కు బెస్ట్ చాయిస్.
ఇతర ఫీచర్లు.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. దీంతో బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్, కాంటాక్టులను సింక్ చేసుకునే సదుపాయాలు కూడా ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్‍కు కూడా ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ లైఫ్.. ఈ స్మార్ట్ వాచ్ లోని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 10 రోజుల వరకు లైఫ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
ధర, లభ్యత.. ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్మార్ట్‌వాచ్ బ్లాక్, గ్రే, గ్రీన్, బ్లూ, క్రీమ్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది. ఇది ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, అలాగే ఆంబ్రేన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,499గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..