AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Ipad 10th Gen: యాపిల్ ఐప్యాడ్‌పై క్రోమాలో బంపర్ ఆఫర్.. కేవలం రూ.30 వేలకే మీ సొంతం

తాజాగా క్రోమా ఐప్యాడ్ టెన్త్ జెనరేషన్ రూ. 33,900కే అందిస్తుంది. మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారార కొనుగోలు చేస్తే రూ. 30,000 కంటే తక్కువ ధరకే పొందవచ్చు. క్రోమాలో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులుకు రూ. 3000 తగ్గింపును అందిస్తుంది. అదేవిధంగా మీకు ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నా రూ. 3000 తగ్గింపు పొందవచ్చు.

Apple Ipad 10th Gen: యాపిల్ ఐప్యాడ్‌పై క్రోమాలో బంపర్ ఆఫర్.. కేవలం రూ.30 వేలకే మీ సొంతం
Apple Ipad 10th Gen
Nikhil
|

Updated on: May 22, 2024 | 4:15 PM

Share

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ వస్తువైనా ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్స్‌లో తక్కువ ధరకు లభిస్తుండడంతో ఆఫ్‌లైన్ కొనుగోళ్లకు గండిపడింది. ఈ నేపథ్యంలో ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై మక్కువ కల్పించేందుకు కొన్ని సంస్థలు ఆన్‌లైన్ కంటే తక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. తాజాగా క్రోమా ఐప్యాడ్ టెన్త్ జెనరేషన్ రూ. 33,900కే అందిస్తుంది. మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారార కొనుగోలు చేస్తే రూ. 30,000 కంటే తక్కువ ధరకే పొందవచ్చు. క్రోమాలో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులుకు రూ. 3000 తగ్గింపును అందిస్తుంది. అదేవిధంగా మీకు ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నా రూ. 3000 తగ్గింపు పొందవచ్చు. ఈ నేపథ్యంలో యాపిల్ ఐప్యాడ్ టెన్త్ జనరేషన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

10వ తరం ఐప్యాడ్‌ సొగసైన ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను ప్రదర్శిస్తుంది. అలాగే 5జీ మద్దతుతో వస్తుంది. ముఖ్యంగా వేగవంతమైన, విశ్వసనీయమైన కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. మునుపటి మోడళ్ల మాదిరిగా కాకుండా ఇది టైప్-సి పోర్ట్‌తో ఈ ఐప్యాడ్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 10.9-అంగుళాల డిస్‌ప్లేతో టాబ్లెట్ డిజైన్ సన్నగా ఉండే బెజెల్స్‌తో ఆధునికీకరించారు. పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ వల్ల భద్రత విషయంలో ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు. ఈ ఐప్యాడ్‌లో 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, సెంటర్ స్టేజ్ ఫంక్షనాలిటీతో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఉంటుంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు వస్తాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ ఐప్యాడ్ ఏ14 బయోనిక్ చిప్‌సెట్‌ ఆధారంగా పని చేస్తుంది. మ్యాజిక్ కీబోర్డ్ ఫోలియో కవర్‌తో వచ్చే 10వ తరం ఐప్యాడ్ అందరినీ ఆఖట్టుుంటుంది. ముఖ్యంగా ఈ ఐప్యాడ్‌పై రూ. 9,000 తగ్గింపుతో కూడిన అదనపు ప్రోత్సాహకం అందిస్తారు. అందువల్ల సంతృప్తికరమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..