AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Camon Series Phones: ఇవి ‘కామన్’ మ్యాన్ ఫోన్లు.. అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు..

టెక్నో విడుదల చేసిన కామన్ 30 సిరీస్ ఫోన్లు దేశమంతటా అందుబాటులో ఉన్నాయి. మంచి డిజైన్,లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. కామన్ 30, కేమన్ 30 ప్రీమియర్ పేర్లతో ఇవి విడుదలయ్యాయి. వీటిలో 50 ఎంపీ ఏఎఫ్ ఫ్రంట్ కెమెరా, సూపర్ నైట్ మోడ్, ఏఐ మ్యాజిక్‌తో పాటు100 ఎంపీ ఓఐఎస్ మోడ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Tecno Camon Series Phones: ఇవి ‘కామన్’ మ్యాన్ ఫోన్లు.. అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు..
Tecno Camon 30
Madhu
|

Updated on: May 22, 2024 | 2:04 PM

Share

దేశంలో అత్యధిక ఫీచర్ల కలిగిన లేటెస్ట్ ఫోన్ల కు కొరత లేదు. ఒకదానికి మించి మరొకటి సూపర్ లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ధరలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారికి అందుబాటులో ఉండేలా టెక్నో కంపెనీ కామన్ 30 సిరిస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో రూపొందించింది.

స్పెషల్ ఫీచర్లు..

టెక్నో విడుదల చేసిన కామన్ 30 సిరీస్ ఫోన్లు దేశమంతటా అందుబాటులో ఉన్నాయి. మంచి డిజైన్,లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. కామన్ 30, కేమన్ 30 ప్రీమియర్ పేర్లతో ఇవి విడుదలయ్యాయి. వీటిలో 50 ఎంపీ ఏఎఫ్ ఫ్రంట్ కెమెరా, సూపర్ నైట్ మోడ్, ఏఐ మ్యాజిక్‌తో పాటు100 ఎంపీ ఓఐఎస్ మోడ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

ధరల వివరాలు..

కామన్ 30 5జీ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీనిలోని 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ. 22,999, అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ. 26,999కు అందుబాటులో ఉన్నాయి. రెండు వేరియంట్‌లపై రూ. 3 వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు, దీంతో వీటి ధరలు రూ.19,999, రూ.23,999గా మారతాయి. అలాగే దీనిలోని మరో వెర్షన్ అయిన కేమన్ 30 ప్రీమియర్ 5G ఫోన్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో రూ. 39,999కి అందుబాటులో ఉంది. రూ.3 వేల ఇన్ స్టంట్ తగ్గింపుతో రూ.36,999కి లభిస్తుంది. అదనంగా బ్రాండ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కస్టమర్లకు రూ.4,999 విలువైన కాంప్లిమెంటరీ గూడీస్‌ను అందిస్తోంది.

ప్రత్యేకతలు ఇవే..

టెక్నో కామన్ 30 ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ లో రూపొందించారు. 6.78 అంగుళాల ఎల్ టీపీఎస్ అమోల్డ్ డిస్‌ప్లే స్పష్టమైన విజువల్స్‌ అందిస్తుంది. మృదువైన స్క్రోలింగ్, గేమ్‌ప్లే తో సమర్థంగా పనిచేస్తుంది. 1300 నిట్‌ల వరకు ప్రకాశంతో ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ బరువు 199 గ్రాములు. చేతిలో చక్కగా ఉంటుంది. ఐపీ 53 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా ఐ ట్రాకింగ్ ఆటో ఫోకస్‌తో కూడిన 50 ఎంపీ సెన్సార్ తో సెల్ఫీలకు చాలా బాగుంటుంది. వెనుక 50 ఎంపీ సోనీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, ఏఐ- పవర్డ్ క్యూవీజీఏ లెన్స్ ఉన్నాయి.

శక్తివంతమైన బ్యాటరీ..

ఈ ఫోన్ 6 ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్, ఆక్టా-కోర్ సెటప్‌తో డీ7020 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 33 డబ్ల్యూ లేదా 70 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 70 డబ్ల్యూ చార్జర్‌తో కేవలం 19 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ లో డాల్బీ అట్మోస్ సౌండ్, డ్యూయల్ స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సాల్ట్ వైట్, ఐస్లాండ్ బసాల్టిక్ డార్క్ రంగులలో అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..