BSNL 4G: వెనుకబడిపోతున్న బీఎస్‌ఎన్‌ఎల్.. ఆరు నెలల్లో 4G సేవలు ప్రారంభం
BSNL 4G: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇండియన్ టెలికాం మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది...
BSNL 4G: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇండియన్ టెలికాం మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. రెండు సంవత్సరాల ఆలస్యం తర్వాత, BSNL ఎట్టకేలకు మెట్రో, పెద్ద నగరాల్లో 4G సేవను వచ్చే నాలుగు నుండి ఆరు నెలల్లో ప్రారంభించబోతోంది. కంపెనీ TCS తో తన 4G పరీక్షను ఫిబ్రవరి 28న పూర్తి చేసింది. 2019 నుండి 4G సేవను అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ 4జీ సేవలు ప్రారంభించలేదు బీఎస్‌ఎన్‌ఎల్. అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పుడు 5Gని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
BSNL తన 4G సేవను ప్రారంభించినప్పుడు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర టెలికాం కంపెనీలు 5G సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.ఎందుకంటే ఈ ఏడాది మేలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. వేలం తర్వాత టెలికాం కంపెనీలు 5G సేవలను ప్రారంభించడానికి కేవలం 4 నుండి 6 నెలల సమయం పడుతుంది. ఒక వైపు అన్ని టెలికాం కంపెనీలు 5జీ సేవలు ప్రారంభిస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం 4జీ సేవల్లోనే ఉంది.
ఇవి కూడా చదవండి: