BSNL Recharge Plans: జియో, ఎయిర్‌టెల్‌కు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. తక్కువ ధరలోనే రెండు నయా రీచార్జ్ ప్లాన్స్ ప్రకటన
భారతదేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇటీవల తమ రీఛార్జ్ ధరలను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులు చౌకైన రీచార్జ్ ఇచ్చే కంపెనీల గురించి వెతుకుతున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెబుతూ ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్స్‌ను ఇటీవల ప్రకటించింది.

భారతదేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇటీవల తమ రీఛార్జ్ ధరలను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ వినియోగదారులు చౌకైన రీచార్జ్ ఇచ్చే కంపెనీల గురించి వెతుకుతున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెబుతూ ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్స్‌ను ఇటీవల ప్రకటించింది. 28 రోజులు, 30 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్స్ బడ్జెట్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రూ.108 ప్లాన్
స్టాండ్‌అవుట్ రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా రూ. 108తో 28 రోజుల వ్యాలిడిటీతో కొత్త రీచార్జ్ ప్లాన్ మన ముందుకు బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. అదనపు ఛార్జీల గురించి ఎలాంటి చింత లేకుండా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. అలాగే రోజుకు 1 జీబీ డేటా వస్తుంది. ఒకవేళడేటా అయిపోతే వినియోగదారులు 40 కేబీపీఎస్ వేగంతో బ్రౌజ్ చేయడం కొనసాగించవచ్చు. అయితే ఇది ఫస్ట్ రీఛార్జ్ కూపన్ ప్లాన్ అని గమనించాలి. అంటే ఇది కొత్త నంబర్‌తో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. మంచి డేటా, అపరిమిత కాల్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ నెట్ వర్క్ కోసం చూస్తున్న కొత్త వినియోగదారులకు ఈ రీఛార్జ్ ప్లాన్ ది బెస్ట్ అని నిపుణులు పేర్కొంటున్నారు.
రూ.199 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ.199తో 30 రోజుల వ్యాలిడిటీతో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ అపరిమిత ఉచిత కాలింగ్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా మొత్తం నెలకు 60 జీబీ డేటాను వాడుకోవచ్చు. అంటే రోజుకు 2 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్ కింద రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ ఒక నెల పాటు డేటా, కాలింగ్ ప్రయోజనాలు రెండూ అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








