AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Recharge Plans: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు

భారతదేశ టెలికాం రంగంలో జియో ఎంట్రీ తర్వాత రీచార్జ్ ప్లాన్స్ ధరలు సగటు వినియోగిదారుడికి అందుబాటులోకి వచ్చాయి. అయితే మారుతున్న రోజులతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇటీవల కాలంలో జియో కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించింది. జియోతో పాటు ఇతర టెలికాం కంపెనీలు కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించాయి.  ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచిన తర్వాత జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం మూడు కొత్త సరసమైన ప్లాన్‌లను పరిచయం చేసింది.

Jio Recharge Plans: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు
Jio
Nikhil
|

Updated on: Jul 22, 2024 | 4:30 PM

Share

భారతదేశ టెలికాం రంగంలో జియో ఎంట్రీ తర్వాత రీచార్జ్ ప్లాన్స్ ధరలు సగటు వినియోగిదారుడికి అందుబాటులోకి వచ్చాయి. అయితే మారుతున్న రోజులతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇటీవల కాలంలో జియో కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించింది. జియోతో పాటు ఇతర టెలికాం కంపెనీలు కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను సవరించాయి.  ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచిన తర్వాత జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం మూడు కొత్త సరసమైన ప్లాన్‌లను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్‌లు ఉచిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీ స్ట్రీమింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు జియో ఈ తరహా ప్లాన్స్ తీసుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జియో రూ.329 ప్లాన్

  • జియో రూ.329 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది
  • ఇది రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుంది.
  • ఈ ప్లాన్‌లో ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్ ఉంది
  • ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. 
  • ఓటీటీ ప్రయోజనాల్లో జియో టీవీ జియో సినిమా, జియో క్లౌడ్, జియో సావన్ ప్రోను పొందవచ్చు. 
  • అవసరమైన ఓటీటీ సేవలతో స్వల్పకాలిక ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.

జియో రూ.949 ప్లాన్

  • జియో రూ.949 ప్లాన్ 84 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది.
  • ఇది అపరిమిత ఉచిత కాలింగ్‌‌తో పాటు రోజుకు 2జీబీ  డేటాను పొందుతారు.
  • ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్) కోసం 90-రోజుల సభ్యత్వాన్ని అందిస్తుంది. 
  • ఇది 5జీ వెల్‌కమ్ ఆఫర్‌తో వస్తుంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అనుభవించాలని చూస్తున్న వినియోగదారుల అనువుగా ఉంటుంది.

జియో రూ.1,049 ప్లాన్

  • ఈ ప్లాన్ 84 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది
  • అలాగే రోజుకు 2జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. 
  • ఓటీటీ ప్రయోజనాల విషయానికి వస్తే సోనీ లివ్, జీ-5 సభ్యత్వాన్ని పొందవచ్చు. అలాగే జియో టీవీ మొబైల్ సేవలను ఆశ్వాదింవచ్చు. 
  • అలాగే ఈ ప్లాన్ 5జీ వెల్‌కమ్ ఆఫర్‌‌తో వస్తుంది.