Boult Smartwatch: మైమరపించే ఫీచర్లు.. మురిపించే డిజైన్‌తో బౌల్ట్ మిరేజ్ స్మార్ట్ వాచ్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..
బౌల్ట్ ఆడియో నుంచి ఓ స్మార్ట్ వాచ్ ఇటీవల మన దేశంలో లాంచ్ అయ్యింది. బౌల్ట్ మిరేజ్ పేరుతో ఇది విడుదలైంది. దీని ధర మన దేశంలో రూ. 1,799గా ఉంది. ఇది ప్రారంభ ఆఫర్లో భాగంగా అందిస్తున్న ధర. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ. 2,199గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కావాలనుకునేవారు ఈ బ్రాండ్ అధికారికి వెబ్ సైట్ తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.

గ్లోబల్ వైడ్ గా స్మార్ట్ వాచ్ ల ట్రెండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో పలు దేశీయ కంపెనీలు కూడా స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో బౌల్ట్ ఆడియో ఒకటి. ఈ బౌల్ట్ ఆడియో నుంచి ఓ కొత్త స్మార్ట్ వాచ్ ఇటీవల మన దేశంలో లాంచ్ అయ్యింది. బౌల్ట్ మిరేజ్ పేరుతో ఇది విడుదలైంది. దీని ధర మన దేశంలో రూ. 1,799గా ఉంది. ఇది ప్రారంభ ఆఫర్లో భాగంగా అందిస్తున్న ధర. ఈ స్మార్ట్ వాచ్ ఎమ్మార్పీ రూ. 2,199గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కావాలనుకునేవారు ఈ బ్రాండ్ అధికారికి వెబ్ సైట్ తో పాటు, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. దీనిలో వివిధ రకాల స్ట్రాప్ ఆప్షన్లు ఉన్నాయి. జింక్ అల్లాయ్ ఫ్రేమ్, మెటాలిక్ స్ట్రాప్స్(ఐనాక్స్ స్టీల్, యాంబర్ బ్లూ, కోల్ బ్లాక్). దీనికి సంబంధించిన పూర్తి స్పెక్స్, ఫీచర్లు ఇప్పుడు చూద్దాం..
బౌల్ట్ మిరేజ్ స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ వాచ్ లో 1.39 అంగుళాల హెచ్ డిస్ ప్లే ఉంటుంది. బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్, 120 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఐపీ67రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీనితో ఇది వర్షం తడిసినా ఏమీ కాదు. అదే వర్క్ అవుట్లు చేసే సమయంలో కూడా చమట ప్రభావం కూడా చూపదు.
బౌల్ట్ మిరేజ్ ఫీచర్లు..
ఈ స్మార్ట్ వాచ్ లో బిల్ట్ ఇన్ హార్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్లీప్ ట్రాకర్ ఉంటాయి. ఇవి వాచ్ ధరించిన వారి సంపూర్ణ ఆరోగ్యానికి, ఫిట్ నెస్ సహకరిస్తుంది. అంతేకాక దీనిలో మీ ఫోన్ కు వచ్చే కాల్స్, మెసేజెస్ అలాగే వివిధ యాప్స్ ద్వారా వచ్చే నోటిఫికేషన్లు, వెదర్ ఫోర్ కాస్ట్ వంటివి వాచ్ లో చూసే వీలుంటుంది. అలాగే మ్యూజిక్ ప్లేయర్, కెమెరా కంట్రోల్ కూడా వాచ్ నుంచే చేయొచ్చు. దీనిలో బ్యాటరీని సింగిల్ చార్జ్ చేస్తే ఏడు రోజుల వరకూ పనిచేస్తుందని బౌల్ట్ కంపెనీ ప్రకటించింది.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా..
ఈ వాచ్ ప్రారంభం సందర్భంగా బౌల్ట్ ఆడియో కో ఫౌండర్ వరుణ్ గుప్తా మాట్లాడుతూ ఈ స్మార్ట్ వాచ్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చినట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతికతో పాటు స్టైలిష్ డిజైన్ తో వచ్చినట్లు చెప్పారు. ఇది వినియోగదారుల రోజువారీ పనులను కూడా నిర్వర్తించేందుకు ఉపకరిస్తుందని చెప్పారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..