Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BoAt Smartwatch: ఇక ఫోన్‌తో పనిలేదు.. మొత్తం మణికట్టులోనే.. ఈ-సిమ్ సపోర్టుతో కొత్త స్మార్ట్ వాచ్..

బోట్ కంపెనీ మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈసారి సాధారణ వాచ్ లా కాకుండా ప్రత్యేకంగా ఉండేందుకు పెద్దగానే ప్రణాళిక చేస్తోంది. అందులో భాగంగా దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. ఈ రెండు కలిసి సంయుక్తగా బోట్ లూనార్ ప్రో ఎల్టీఈ స్మార్ట్ వాచ్ ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇది జియో ఈ-సిమ్ సాంకేతికతతో వస్తున్నట్లు వెల్లడించారు.

BoAt Smartwatch: ఇక ఫోన్‌తో పనిలేదు.. మొత్తం మణికట్టులోనే.. ఈ-సిమ్ సపోర్టుతో కొత్త స్మార్ట్ వాచ్..
Boat Lunar Pro Lte Smartwatch
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 12, 2023 | 7:13 PM

మన దేశంలో తక్కువ ధరతో పాటు టాప్ ఫీచర్లను అందించే స్మార్ట్ వాచ్ బ్రాండ్ లలో బోట్ ఒకటి. నాణ్యతకు పెట్టింది పేరుగా బోట్ గ్యాడ్జెట్లు ఉంటాయి. ఇప్పటికే పలు రకాల స్మార్ట్ వాచ్ లు బోట్ నుంచి అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో వాటికి మంచి డిమాండే ఉంటుంది. ఈ క్రమంలో బోట్ కంపెనీ మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈసారి సాధారణ వాచ్ లా కాకుండా ప్రత్యేకంగా ఉండేందుకు పెద్దగానే ప్రణాళిక చేస్తోంది. అందులో భాగంగా దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. ఈ రెండు కలిసి సంయుక్తగా బోట్ లూనార్ ప్రో ఎల్టీఈ స్మార్ట్ వాచ్ ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇది జియో ఈ-సిమ్ సాంకేతికతతో వస్తున్నట్లు వెల్లడించారు. దీని సాయంతో మీ ఫోన్ మీ చేతుల్లో లేకపోయినా.. అది ఎక్కడ మర్చిపోయినా సులభంగా దానితో కనెక్ట్ అయ్యి ఉంటారని పేర్కొన్నారు.

లూనార్ ప్రో ఎల్టీఈ ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అంతర్నిర్మిత జీపీఎస్. మీరు రన్నింగ్, సైక్లింగ్ లేదా హైకింగ్ చేస్తుంటే, ఈ వాచ్ మీ మార్గాలను కచ్చితంగా ట్రాక్ చేయగలగుతుంది. ఇది మీరు ఎంత దూరం వెళ్ళారు? మీరు అనుసరించిన మార్గం ఏంటి అనేది చూపుతుంది, ఇది బహిరంగ కార్యకలాపాలను ఇష్టపడే వ్యక్తులకు గొప్పగా చేస్తుంది. అంతేకాక దీనిలో స్పష్టమైన 1.39-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నట్లయితే, మీ ఆరోగ్యానికి మంచిది కాదని రిమైండర్ చేస్తుంది.

ఫీచర్ ప్యాక్డ్..

మీ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి అన్ని ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా, లూనార్ వాచ్‌లో హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఫిట్‌నెస్ ట్రాకర్ వంటి టూల్స్ కూడా ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యం, ఫిట్‌నెస్ లక్ష్యాలపై నిఘా ఉంచడంలో మీకు సహాయపడతాయి.

జియోతో భాగస్వామ్యం గురించి బోట్ సహ వ్యవస్థాపకుడు, సీఎంఓ అమన్ గుప్తా మాట్లాడుతూ వినియోగదారుడికి ఆధునిక సాంకేతిక అందించేందుకు తాము సంయుక్తంగా పనిచేస్తున్నామన్నారు. ఈ వాచ్ ప్రజలు కనెక్ట్ అయ్యే విధానాన్ని మారుస్తుందని మేము భావిస్తున్నామని చెప్పారు. జియో బలమైన 4జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే ఈ ఎల్టీఈ స్మార్ట్‌వాచ్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ భాగస్వామ్యం మా కస్టమర్‌లకు సరికొత్త సాంకేతికతను అందించడంలో మా అంకితభావాన్ని చూపుతుందని చెప్పుకొచ్చారు.

త్వరలో మార్కెట్లోకి..

బోట్ లూనార్ ప్రో ఎల్టీఈ స్మార్ట్‌వాచ్ త్వరలో స్టోర్‌లలోకి రానుంది. లాంచింగ్ తేదీని అధికారికంగా ఇంకా ప్రకటించబడలేదు, భారతదేశంలో స్మార్ట్ వాచ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..