WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. ఈ తప్పులు చేస్తే ఏకంగా జైలుకే..
వాట్సాప్.. ప్రస్తుతం దీని వినియోగం పెరిగిపెయింది. వాట్సాప్ యాప్ లేనిది ఏ స్మార్ట్ ఫోనక్ష ఉండదేమో. ఎందుకంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు..
వాట్సాప్.. ప్రస్తుతం దీని వినియోగం పెరిగిపెయింది. వాట్సాప్ యాప్ లేనిది ఏ స్మార్ట్ ఫోనక్ష ఉండదేమో. ఎందుకంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ అనేది ఈ రోజుల్లో జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. అయితే వాట్సాప్ వాడే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే చిక్కుల్లో పడిపోతారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండి ఇష్టానుసారంగా వీడియోలు, ఇతర మెసేజ్‌లను షేర్ చేస్తే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంటుంది. వాట్సాప్‌లో అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నవారికి గుర్తించి వారి వాట్సాప్ అకౌంట్‌ను బ్యాన్ చేస్తోంది కంపెనీ. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా పరిచయమైన వాట్సప్ ఆ తర్వాత ఎన్నో ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. రోజురోజుకు కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
మొదట్లో వాట్సప్‌లో మెసేజెస్ మాత్రమే పంపేవాళ్లం. కానీ ఆ తర్వాత ఫోటోస్, ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ కూడా షేర్ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కూడా చేస్తున్నాము. వాట్సాప్‌లో రోజూ కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తుండటంతో చాలా మంది దీనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. ఈ రోజుల్లో వాట్సాప్ లేనిది గడవని పరిస్థితి నెలకొంది. అయితే వాట్సాప్‌లో కొన్ని తప్పులు చేయకూడదని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
పోర్న్ క్లిప్స్ షేరింగ్‌లో జాగ్రత్త
వాట్సాప్‌లో పోర్న్ క్లిప్స్ షేర్ చేయడం పెద్ద తప్పు. ఇది మిమ్మల్ని జైలు వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో వాట్సాప్ కఠిన నిబంధనలను రూపొందించింది. మీ ఖాతా బ్యాన్ చేసి, మీపై పోలీస్ ఫిర్యాదు కూడా ఇవ్వవచ్చు. ఇతరుల పేరు మీద వాట్సాప్ ఖాతా ఓపెన్ చేస్తే మీరు చిక్కుల్లో పడినట్లే. మీరు వాట్సాప్‌లో వచ్చిన సమాచారాన్ని నిజమో.. కాదో తెలుసుకోకుండా షేర్ చేసినట్లయితే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల చిక్కుల్లో పడ్డ ఎన్నో ఘటనలు జరిగాయి. అందుకే నకిలీ వార్తలను షేర్ చేయవద్దు. కులమతాలు, వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు కూడా చేయవద్దు.
వాట్సాప్ గ్రూపుల విషయంలో జాగ్రత్త:
అయితే ఎవరు పడితే వారు మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. అయితే అలా గ్రూపుల్లో యాడ్ చేస్తున్నట్లయితే ప్రైవసీ సెట్టింగ్స్‌లో మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో పర్మిషన్ ఇవ్వొచ్చు. మీకు అవసరం లేని మెసేజెస్ సేవ్ చేయకండి. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌తో మీ వాట్సప్ మెసేజెస్ ఎప్పటికప్పుడు డిలిట్ అయ్యేలా సెట్టింగ్స్ చేయవచ్చు. అందుకే వాట్సాప్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది షేర్ చేయడం లాంటివి చేయవద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అందరికీ మా వాట్సప్ నెంబర్ ఇవ్వకండి. మీరు ఇటీవల కాలంలో కాంటాక్ట్‌లో లేనివాళ్ల నెంబర్స్ డిలిట్ చేయండి. రెండుమూడేళ్ల క్రితం మిమ్మల్ని వాట్సప్‌లో కాంటాక్ట్ అయినవారితో ఇప్పుడు ఎలాంటి పని ఉండకపోవచ్చు. అలాంటి నెంబర్స్ డిలిట్ చేయడం మంచిది. దీంతో మీ వాట్సప్ క్లీన్‌గా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి