Account Passwords: మీ అకౌంట్లకు ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మరి ఎలా ఉండాలి?
చాలా మంది బ్యాంకు అకౌంట్, వివిధ పేమెంట్స్ యాప్స్, సోషల్ మీడియా అకౌంట్లకు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం తప్పనిసరి. అయితే పాస్‌వర్డ్‌లు పెట్టుకునే ముందు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం..
చాలా మంది బ్యాంకు అకౌంట్, వివిధ పేమెంట్స్ యాప్స్, సోషల్ మీడియా అకౌంట్లకు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం తప్పనిసరి. అయితే పాస్‌వర్డ్‌లు పెట్టుకునే ముందు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సులభమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం వల్ల మీ అకౌంట్ హ్యాకర్లు హ్యాక్ చేసి మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకులో ఉన్న డబ్బంతా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. అందుకే పాస్‌వర్డ్‌లు పెట్టుకునే ముందు బలమైనది పెట్టుకోవడం చాలా ముఖ్యమంటున్నారు టెక్ నిపుణులు. సులభమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర అకౌంట్‌లపై కన్నేసి ఉంచుతున్నారు. ఈ సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను దోచేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. సులభమైన పాస్‌వర్డ్‌లు ఏంటో ఇప్పటి నిపుణులు గుర్తించి వినియోగారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డులు ఇవే..
123456, password1, qwerty, password, 111111, abc123, 12345,1234567, 12345678, 2222, 112233 ఇలాంటి సులభంగా గుర్తుండే పాస్‌వర్డ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే సైబర్ నేరగాళ్ల నుంచి ప్రమాదం ఉందని, వీటి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పాస్‌వర్డ్‌ల వల్ల సైబర్ నేరగాళ్లు గుర్తించి మీ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర అకౌంట్లను హ్యాక్ చేసే అవకాశం ఉందని, దీని వల్ల మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇలా తెలుసుకోవడం వల్ల మీ బ్యాంక్ అంకౌట్ వివరాలు కూడా తెలుసుకుంటారని, తర్వాత మీ ఖాతాలో ఉండే మొత్తం కాజేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం ప్రమాదమేనని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి