Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asteroid:భూమి వైపు దూసుకొస్తున్న మరో భారీ గ్రహశకలం..NASA ఏం చెప్పిందంటే?

గత సంవత్సరం భూమి వైపు దూసుకువచ్చిన పెద్ద గ్రహశకలం అపోఫిస్ అదృష్టవశాత్తు భూమి పక్కగా వెళ్ళిపోయింది.

Asteroid:భూమి వైపు దూసుకొస్తున్న మరో భారీ గ్రహశకలం..NASA ఏం చెప్పిందంటే?
Astroid
Follow us
KVD Varma

|

Updated on: Apr 06, 2021 | 6:55 PM

Asteroid: గత సంవత్సరం భూమి వైపు దూసుకువచ్చిన పెద్ద గ్రహశకలం అపోఫిస్ అదృష్టవశాత్తు భూమి పక్కగా వెళ్ళిపోయింది. అయితే, ఈ సంవత్సరం ఇంకో పెద్ద గ్రహశకలం వేగంగా భూమి వైపు దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటివరకూ భూమి వైపు దూసుకుని వచ్చిన గ్రహశకలాలు అన్నిటికంటే వేగంగా సెకనుకు 9 కిలోమీటర్ల వేగంతో ఈ ఆస్టరాయిడ్ దూసుకువస్తోంది.

నాసా శాస్త్రవేత్తలు మార్చి నెలలో ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. ఒక ఫుట్ బాల్ మైదానం అంత ఉన్న ఈ గ్రహశకలం సుమారుగా మే 4వ తేదీ నాటికి భూమికి అత్యంత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది.

ఈ ఆస్టరాయిడ్ 260 నుంచి 580 మీటర్ల వైశాల్యంతో ఉండవచ్చని నాసా అంచనా వేస్తోంది. దీనికి వారు ఏఎఫ్8 అని పేరు పెట్టారు. ఇది ఇప్పటివరకూ భూమి వైపు వచ్చిన గ్రహశకలాలు అన్నిటిలోకి చిన్నదే అయినప్పటికీ అది కదులుతున్న వేగం ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. సెకనుకు 9 కిలోమీటర్ల స్పీడ్ అంటే సామాన్యమైనది కాదని వారంటున్నారు.

నిజానికి ఈ గ్రహశకలం భూమికి 3.4 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ వారు ఈ ఆస్టరాయిడ్ ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇది భూమికి హాని చేయగల ఆస్టరాయిడ్ గా భావిస్తుండటమే దానికి కారణం.

ఇప్పటికే నాసా ఇటువంటి గ్రహశకలాలు 22 గుర్తించింది. రాబోయే వందేళ్లలో వీటిలో ఏదైనా భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. వీటిలో అతిపెద్దదయిన గ్రహశకలం 29075 (1950డిఏ) 2880లో భూమిని ఢీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వారు అంచనా వేశారు.

అసలు ఈ గ్రహశకలాలు ఏమిటి?

సూర్యుని చుట్టూ గ్రహంలా తిరుగుతూ ఉండే రాళ్లలాంటి పదార్ధాలు ఇవి. అయితే ఇవి గ్రహాల కంటే పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. మన సౌర కుటుంబంలో మార్స్, జూపిటర్ గృహాల కక్షలో ఇవి బెల్ట్ లా కనిపిస్తాయి. అంతే కాకుండా ఇవి ఇతర గ్రహాల కక్షల్లోనూ తిరుగుతుంటాయి. అదే విధంగా సూర్యుని చుట్టూ పరిభార్మిస్తుంటాయి.

కక్షల్లో తిరుగుతున్న సమయంలో ఒక్కోసారి ఇవి భూమికి అతి దగ్గరగా వస్తుంటాయి.

Also Read: Mars 2020: ఏప్రిల్ 11 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా..?

Bluetooth: మనం రోజూ ఉపయోగించే ‘బ్లూటూత్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..! దాని వెనుక ఓ పెద్ద కథ ఉంది..!