NASA: అంగారకుడిపై రోవర్‌ దిగిన వీడియో రిలీజ్‌ చేసిన నాసా.. ఆ క్షణాలు ఆద్యంతం అద్భుతం.. చప్పట్లతో హర్షం వ్యక్తం చేసినశాస్త్రవేత్తలు..

NASA: అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్ధారించడానికి అమెరికా పంపిన వ్యోమనౌక 'పర్సెవరెన్స్‌' ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను

NASA: అంగారకుడిపై రోవర్‌ దిగిన వీడియో రిలీజ్‌ చేసిన నాసా.. ఆ క్షణాలు ఆద్యంతం అద్భుతం.. చప్పట్లతో హర్షం వ్యక్తం చేసినశాస్త్రవేత్తలు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 23, 2021 | 4:56 AM

NASA: అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది నిర్ధారించడానికి అమెరికా పంపిన వ్యోమనౌక ‘పర్సెవరెన్స్‌’ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివిగల ఈ వీడియోలో ‘పర్సెవరెన్స్‌’ అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్‌ అయిన క్షణాలు ఈ వీడియోలో రికార్డు అయ్యాయి. వ్యోమనౌక ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో రోవర్‌ కిందకి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పర్సెవరెన్స్‌ రోవర్‌ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే.

ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లును ఇంజినీర్లు అమర్చారు. వీటిలో 7 కెమెరాలను ల్యాండింగ్‌ సమయంలోనే రికార్డు చేయడానికి ఇంజినీర్లు స్విచ్‌ ఆన్‌ చేశారు. రానున్న కొద్ది రోజుల్లో రోవర్‌ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు, వీడియో రికార్డింగ్‌లను వెలువరిస్తామని చెప్పిన మూడు రోజులకే నాసా తాజాగా ఈ వీడియో విడుదల చేసింది. ఇప్పటికే పర్సెవరెన్స్‌ అరుణ గ్రహ ఉపరితలానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలు పంపిన సంగతి తెలిసిందే.

AP SEC Orders : మార్చి10ని సెలవుదినంగా ప్రకటించాలి..! కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ఎస్‌ఈసీ