Zoom Bug: జూమ్ యూజర్లకు అలర్ట్.. యాప్ ఓపెన్ చేయకపోయినా వీడియో రికార్డింగ్..
Zoom Bug: ఏమంటూ కరోనా మహమ్మారి మానవ జీవితాల్లోకి ప్రవేశించిందో టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వెరసి ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే జూమ్ వీడియో మీటింగ్ అప్లికేషన్‌కు ప్రాముఖ్యత బాగా పెరిగింది...
Zoom Bug: ఏమంటూ కరోనా మహమ్మారి మానవ జీవితాల్లోకి ప్రవేశించిందో టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వెరసి ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలోనే జూమ్ వీడియో మీటింగ్ అప్లికేషన్‌కు ప్రాముఖ్యత బాగా పెరిగింది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండడంతో చాలా మంది జూమ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా జూమ్ యాప్‌లో బగ్ ఉందన్న వార్త యూజర్లను ఆందోళనకు గురి చేస్తోంది. యాపిల్ కంపెనీకి చెందిన మ్యాక్ ల్యాప్‌టాప్స్‌లో జూమ్ యాప్ ఉపయోగించే వారికి ఈ బగ్ ద్వారా నష్టం జరుగుతోందని తెలుస్తోంది.
జూమ్ యాప్‌ను ఉపయోగించని సమయంలో కూడా అటోమేటిక్‌గా వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అవుతుందని కొందరు యాపిల్ మ్యాక్ యూజర్లు నివేదించారు. దీంతో మ్యాక్ ల్యాప్‌టాప్స్ ఉపయోగిస్తున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మరి దీనిపై జూమ్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే జూమ్ యాప్‌పై ఇలాంటి ఫిర్యాదు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా ఇలాంటి ఫిర్యాదు రావడంతో జూమ్ 5.91 అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే తాజాగా కొందరు యూజర్లు మరోసారి సమస్యను ప్రస్తావించడంతో బగ్ బయటపడింది. ఈ విషయంపై జూమ్ స్పందించింది. త్వరలోనే యాప్‌లో ఉన్న బగ్‌ను పరిష్కరిస్తామని తెలిపింది.
ఇదిలా ఉంటే వెబ్ క్యామ్‌ను ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వెబ్ క్యామ్‌తో అవసరం లేనప్పుడు కెమెరాకు అడ్డుగా ఏదైనా పెట్టాలని చెబుతున్నారు. ఇలా వెబ్ క్యామ్‌ను కవర్ చేసే రకరకాల గ్యాడ్జెట్లు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. హ్యాకింగ్ లాంటివి ఎక్కువుతోన్న ప్రస్తుత రోజుల్లో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి అని సైబర్ నిపుణులు చెబుతూనే ఉన్నారు.
Also Read: Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళాకు మొదలైన భక్తుల తాకిడి.. ఈనెల 18న మేడారం జాతరకు సీఎం కేసీఆర్
Viral Video: తగ్గేదేలే.! వేటాడబోయిన మొసలి.. దిమ్మతిరిగే షాకిచ్చిన సింహం..
Riding Bike: బైక్‌పై వెళ్లేటప్పుడు కరోనా రావొద్దంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి..?