AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone: పాత ఐఫోన్ ఏకంగా రూ. 32 లక్షలకు అమ్ముడుపోయింది.. అంత రేట్ ఎందుకంటే..

ఐఫోన్ హైఎండ్ ధర ఎంత ఉంటుంది? దాదాపు రూ. 2 లక్షలు. మోడల్‌ని బట్టి అంతకంటే తక్కువ ధరకే ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Apple iPhone: పాత ఐఫోన్ ఏకంగా రూ. 32 లక్షలకు అమ్ముడుపోయింది.. అంత రేట్ ఎందుకంటే..
Apple Iphone
Shiva Prajapati
|

Updated on: Oct 20, 2022 | 6:50 PM

Share

ఐఫోన్ హైఎండ్ ధర ఎంత ఉంటుంది? దాదాపు రూ. 2 లక్షలు. మోడల్‌ని బట్టి అంతకంటే తక్కువ ధరకే ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఐఫోన్ మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 32 లక్షల ధరకు అమ్ముడుపోయింది. అవును, మీరు చదివింది నిజంగా నిజం. మరి దానికి అంత స్పెషల్ ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యాక్టరీ సీల్డ్, ఫస్ట్ ఎడిషన్ ఐఫోన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. 2007లో ఐఫోన్ మార్కెట్‌లో విడుదలగా, ఫస్ట్ ఎడిషన్ ఫోన్ ఒకదానికి ప్రస్తుతం వేలం వేశారు. దాని ధర 599 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, ఇది అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో ఏకంగా 39,339.60 డాలర్లు పలికింది. ఇది అసలు ధర కంటే దాదాపు 65 రెట్లు ఎక్కువ. ఫస్ట్ ఎడిషన్ ఐఫోన్‌లో ప్రత్యేక ఫీచర్లు ఏమీ లేవు. కేవలం 8GB స్టోరేజీ, 2MP కెమెరా మాత్రమే ఉంది.

ఈ ఫోన్‌ను వేలంలో మొదట 2,500 డాలర్లు పాడారు. ఆ తరువాత 10,000 డాలర్లకు చేరింది. వేలం జరిగిన మొదటి రెండు రోజులు ధర మారలేదు. ఆ తరువాత జరిగిన 28 వేర్వేరు బిడ్‌లలో ఫోన్ ధర ఐదు అంకెలను మించిపోయింది. ఈ ఫోన్‌ను ఎవరూ వినియోగించలేదని నిర్ధారించడానికి అనేక సూచికలు కూడా ఉన్నాయి. పకడ్బందీ ప్యాకేజీతో, ఫ్యాక్టరీ సీల్ అన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జనవరి 9,2007న మొట్టమొదటి ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. సెల్‌ఫోన్ ప్రారంభించిన 5 నెలల తరువాత దాని క్రేజ్ భారీగా పెరిగింది. ఫస్ట్ జెనరేషన్ ఐఫోన్.. గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లో వెలుగొందింది.

భారత్‌లో 3rd జనరేషన్ ఐఫోన్‌కు టాప్ రేట్..

ఇటీవల భారతదేశంలో 3rd జనరేషన్ ఆపిల్ ఐఫోన్‌ను వేలం వేయగా భారీ ధర పలికింది. ఈ మోడల్ ధర ఈ ఏడాది మార్చిలో రూ. 43,900 నుంచి ప్రారంభమైంది. ఈ హ్యాండ్‌సెట్‌లో మూడు స్టోరేజి మోడల్‌లు ఉన్నాయి. 64GB, 128GB, 256GB. మూడు మోడళ్ల ధరలు వరుసగా రూ.43,900, రూ.48,900, రూ.58,900. తాజా ధరల పెంపు తర్వాత, ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో వేరియంట్‌ల వరుస ధరలు రూ. 49,900 (64GB), రూ. 54,900 (128GB), రూ. 64,900 (256GB) వద్ద లిస్ట్ చేయడం జరిగింది. అంటే ఫోన్ ధర రూ. 6,000 పెరిగింది.

ఇవి కూడా చదవండి

Apple iPhone SE (3rd Generation) A15 బయోనిక్ చిప్‌సెట్ ఆధారితమైనది. iOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది iOS 16 అప్‌డేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ 750×1334 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 4.7-అంగుళాల రెటినా హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది. iPhone SE (3rd Gen) మిడ్‌నైట్, స్టార్‌లైట్ రంగులలో అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..