Google Android 12: గూగుల్ కొత్త ఓఎస్ వచ్చేసింది.. ప్రస్తుతానికైతే ఆ ఫోన్లకే.. ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Android 12 Update: పిక్సెల్ 3 నుంచి ప్రారంభమయిన ఆండ్రాయిడ్ 12 ఓఎస్.. అన్ని పిక్సెల్ ఫోన్‌ల కోసం అందుబాటులోకి వచ్చింది.
Android 12 Update: పిక్సెల్ ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ను గూగుల్ విడుదల చేసింది. ఈమేరకు గూగుల్ తన పిక్సెల్ ఫాల్ లాంచ్ ఈవెంట్‌లో మంగళవారం ప్రకటించింది. తాజా ఆండ్రాయిడ్ వెర్షన్ మొదట డెవలపర్ ప్రివ్యూగా ఫిబ్రవరిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మేలో గూగుల్ ఐ/ఓ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో దీని గురించి వివరించింది. ఆండ్రాయిడ్ 12 సోర్స్ కోడ్‌ని గూగుల్ ఈ నెల ప్రారంభంలోనే ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP) కి అందుబాటులో ఉండేలా చేసింది. ఆండ్రాయిడ్ 12 మెటీరియల్ యూ అని పిలిచే కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ని తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్ డివైజ్‌లలో వ్యక్తిగత ప్రైవసీని మెరుగుపరచడానికి ఉద్దేశించినట్లు గూగుల్ పేర్కొంది. యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌లతో షేర్ చేసుకునే సామర్థ్యంతో సహా కొత్త ప్రైవసీ కంట్రోల్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఫీచర్లు.. పిక్సెల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 తీసుకువచ్చే అతిపెద్ద మార్పులలో ఒకటి మెటీరియల్ యూ డిజైన్ లాంగ్వేజ్. యూజర్లు వారి అభిరుచులు, ప్రాధాన్యతల ప్రకారం అనుకూలమైన రంగుల్లో హోమ్ స్క్రీన్, కొత్త విడ్జెట్‌లను ఎంచుకోవడానికి అనుమతి లభించనుంది. కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లో తాజా యూజర్ అనుభవాన్ని అందించడానికి ఫ్లూయిడ్ మోషన్, యానిమేషన్‌లు కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 కూడా మెరుగైన పవర్ సామర్థ్యంతో మొత్తం యూజర్ అనుభవాలను ఆప్టిమైజ్ చేస్తుంది. కోర్ సిస్టమ్ సేవలకు అవసరమైన సీపీయూ సమయాన్ని 22 శాతం వరకు తగ్గించడానికి, సిస్టమ్ సర్వర్ ద్వారా పెద్ద కోర్ల వినియోగాన్ని 15 శాతం వరకు తగ్గించడానికి అంతర్లీన మెరుగుదలలు కూడా ఇందులో ఉన్నాయి.
మెరుగైన గోప్యతా నియంత్రణలను అందించడానికి ఆండ్రాయిడ్ 12 లో కొత్త గోప్యతా-కేంద్రీకృత మార్పుల జాబితాను కూడా గూగుల్ చేర్చింది. కంట్రోల్ సెట్టింగ్‌లు, ఏ యాప్ ద్వారా ఏ డేటా యాక్సెస్ చేయాలో నిర్ణయించుకోవడానకి కొత్త ప్రైవసీ డాష్‌బోర్డ్ అందించారు. థర్డ్-పార్టీ యాప్‌లకు ఖచ్చితమైన లొకేషన్ వివరాలను ఇవ్వడానికి బదులుగా సుమారుగా లొకేషన్ పర్మిషన్ మంజూరు చేసే ఆప్షన్ కూడా అందించారు. ఏదైనా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు అంతర్నిర్మిత మైక్రోఫోన్ లేదా కెమెరాను యాక్సెస్ చేసినప్పుడు స్క్రీన్ రైట్ సైడ్ టాప్‌లో కొత్త సూచిక కనిపిస్తుంది. ఆపిల్ ఓఎస్‌లో ప్రవేశపెట్టిన గోప్యతా నియంత్రణల మాదిరిగానే ఇవన్నీ ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ డౌన్‌లోడ్ ఎలా.. ఆండ్రాయిడ్ 12 గూగుల్ పిక్సెల్ 3 , పిక్సెల్ 3 ఎక్స్‌ఎల్ , పిక్సెల్ 3 ఎ , పిక్సెల్ 3 ఎ ఎక్స్‌ఎల్ , పిక్సెల్ 4 , పిక్సెల్ 4 ఎక్స్‌ఎల్ , పిక్సెల్ 4 ఏ, పిక్సెల్ 4 ఏ 5 జీ, పిక్సెల్ 5 లతో కూడిన గూగుల్ పిక్సెల్ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ రానుంది. మీకు అప్‌డేట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కొత్త ఓఎస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సిస్టమ్ > అడ్వాన్స్‌డ్ > సిస్టమ్ అప్‌డేట్‌కి వెళ్లి మాన్యువల్‌గా కూడా చెక్ చేసుకోవచ్చు .
పిక్సెల్ ఫోన్లతో సహా మరికొన్ని ఫోన్లకు కూడా ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ రానుంది. శాంసంగ్, వన్ ప్లస్, ఒప్పో, రియల్‌మీ, వివో, షియోమీ ఫోన్లకు కూడా త్వరలోనే ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్ రానుంది.
Also Read: Foxconn Electric Car: ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 750 కిలోమీటర్ల వరకు డోకా ఉండదు..