AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం! 2032లో భూమి అంతం తప్పదా? నాసా ఏం చెబుతోంది!

2032లో భూమి అంతం కాబోతుందా అంటే.. చిన్న ఛాన్స్ ఉందని నాసా అంటోంది. ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు వాయువేగంతో దూసుకొస్తోందని వెల్లడించింది. ఆ గ్రహశకలం ఎప్పుడు వచ్చేది కూడా డేట్ తో సహా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం! 2032లో భూమి అంతం తప్పదా? నాసా ఏం చెబుతోంది!
Earth
SN Pasha
|

Updated on: Feb 14, 2025 | 3:14 PM

Share

ఓ భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోంది. 2032 డిసెంబర్‌లో అది భూమిని ఢీ కొనే ఛాన్స్‌ ఉందని అమెరికన్‌ స్పేస్‌ సెంటర్‌ నాసా(ది నేషనల్‌ ఎరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) వెల్లడించింది. 300 ఫీట్ల వ్యాసార్థంతో ఉన్న గ్రహశకం చాలా వేగంగా భూమిని ఢీకొట్టేందుకు వస్తోంది. అయితే అది భూమి ఢీ కొనే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. 2024 YR4 అని ఆ గ్రహశకలానికి శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. దీన్ని కొన్ని వారాల క్రితమే కనిపెట్టారు. అయితే భూమిని ఢికొట్టే ఛాన్స్‌ 2.3 పర్సెంట్‌ ఉందని, అది కూడా సరిగ్గా 2032 డిసెంబర్‌ 22వ తేదీన జరగొచ్చని నాసా అంచనా వేసింది. అయితే.. ఇప్పటికే నాసా ఆ గ్రహశకల కక్ష్యను పర్యవేకిస్తోంది. అది భూమిని ఢీ కొనకుండా దాని కక్ష్యను దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మార్చి 2025లో ఆ గ్రహశకలాన్ని పరిశీలించి, ఆ గ్రహశకలం పరిమాణాన్ని బాగా అంచనా వేస్తుంది.

గ్రహశకల కక్ష్య గురించి పూర్తి పరిశీలన ముగిశాక.. దాని పరిణామం, ప్రభావం ఎంత ఉంటుందని దానిపై స్పష్టమైన అవగాహన వస్తుందని నాసా వెల్లడించింది. నాసా సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ నిర్వహించే గ్రహశకల ప్రమాద జాబితాలోప దీన్ని కూడా చేర్చారు. అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొనకుండా పక్కకు మళ్లించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ గ్రహశకలం భూమిని ఢీ కొనకుండా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఒక వేళ అది భూమిని ఢీ కొంటే భారీ విలయం చోటు చేసుకోవచ్చు. పైగా అది భూమిపై ఏ ప్రాంతాన్ని ఢీ కొడుతుందనే విషయాన్ని కూడా ఇంకా శాస్త్రవేత్తలు అంచనా వేయలేదు. చాలా దూరంలోనే ఉండగా దాని కక్ష్యను మార్చే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఉన్నారు.

మరిన్ని  సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..