BSNL 4G: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారా? నెట్‌వర్క్ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోండిలా..
BSNL: బీఎప్ఎన్ఎల్ 4జీ సేవలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం పనితీరు మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర సమాచార, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గతంలో చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కి ఇంత మంది వచ్చినప్పుడు, వారికి అవసరమైన నెట్‌వర్క్ కవరేజీని కంపెనీ అందించగలదా..

ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచిన తర్వాత లక్షలాది మంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. బీఎస్ఎన్‌ఎల్‌లో తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు తన వినియోగదారులకు 4G సేవలను చాలా త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా చాలా చక్కగా స్పందిస్తోంది.
BSNL 4G సేవలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం పనితీరు మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర సమాచార, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గతంలో చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కి ఇంత మంది వచ్చినప్పుడు, వారికి అవసరమైన నెట్‌వర్క్ కవరేజీని కంపెనీ అందించగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విధంగా, బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకోవాలనుకుంటున్న వారు సమీపంలోని టవర్లను కూడా తనిఖీ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం.
టవర్‌ను ఎలా కనుగొనాలి?
- https://tarangsanchar.gov.in/emfportal వెబ్‌సైట్‌కి వెళ్లండి
- క్రిందికి స్క్రోల్ చేసి, ‘my position’పై క్లిక్ చేయండి
- స్క్రీన్‌పై మీ పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా నమోదు చేయండి
- ‘OTPని ఉపయోగించి మెయిల్ పంపు’పై క్లిక్ చేయండి
- OTPని నమోదు చేయండి.
- స్క్రీన్‌పై మీకు సమీపంలోని అన్ని సెల్ ఫోన్ టవర్‌ల మ్యాప్ కనిపిస్తుంది.
- సిగ్నల్ (2G/3G/4G లేదా 5G), ఆపరేటర్‌ని పొందడానికి ఏదైనా టవర్‌పై క్లిక్ చేయండి.