Amazon Year End sale: అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్.. స్మార్ట్ ఫోన్స్‌పై..
ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై మంచి డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్, సామ్‌సంగ్, రియల్‌మీ నార్జో, షావోమీ, యాపిల్, మోటరోలాతోపాటు మరికొన్ని బ్రాండ్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇక కస్టమర్లకు నో కాస్ ఈఎమ్‌ఐతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సైతం అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై అందిస్తున్న బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..
2023 ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో పాత ఏడాదికి వీడ్కోలు చెప్పి, కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కామర్స్ సైట్స్ ఇయర్ ఎండ్ సేల్ పేరుతో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందిస్తున్నారు. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రకటించగా తాజాగా మరో ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్ అమెజాన్ సైతం అదిరిపోయే సేల్‌ను అందిస్తోంది. అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను అందిస్తోంది.
ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై మంచి డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్, సామ్‌సంగ్, రియల్‌మీ నార్జో, షావోమీ, యాపిల్, మోటరోలాతోపాటు మరికొన్ని బ్రాండ్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇక కస్టమర్లకు నో కాస్ ఈఎమ్‌ఐతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సైతం అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై అందిస్తున్న బెస్ట్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..
ఐఫోన్ 13..
2021లో లాంచ్ అయిన ఐఫోన్ 13ని సేల్‌లో భాగంగా రూ. 52,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినీ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 4కే డాబ్లీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్ ఈ ఫోన్ సొంతం. అలాగే ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
వన్‌ప్లస్ 11 ఆర్ 5జీ..
అమెజాన్‌లో సేల్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోన్న మరో స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 11 ఆర్. ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో రూ. 39,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో రోబస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ ఈ ఫోన్ సొంతం. ఇక 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
రియల్‌మీ నార్జో ఎన్ 55..
రియల్‌మీ నార్జో ఎన్ 55ని బడ్జెట్ ధరలో తీసుకొచ్చారు. అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్‌ను కేవలం రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో 64 మెగాపిక్సెల్స్ కూడిన ఏఐ రెయిర్ కెమెరాను ఇచ్చారు. ఇక స్క్రీన్ విషయానికొస్తే.. 6.72 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్..
అమెజాన్ సేల్‌లో మండి డీల్స్‌లో ఇది ఒకటి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్‌ను సేల్‌లో భాగంగా రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇందులో ఇచ్చారు. ఇక కెమరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్14..
తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్ 14 5జీ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా రూ. 11,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్లో హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడి ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..