Amazon chatbot: అమెజాన్ నుంచి కొత్త సేవలు.. చాట్ జీపీటీ తరహాలో..
ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి అమెజాన్ కూడా వచ్చి చేరింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సైతం ఏఐ చాట్ బాట్‌ను తీసుకొస్తోంది. చాట్ జీపీటీ తరహాలో ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్ చేయనుంది. అమెజాన్ క్యూ పేరుతో ఈ చాట్‌బాట్‌ను తీసుకురానున్నారు. ఇప్పటికే బార్డ్ పేరుతో గూగుల్, ఓపెన్ పేరుతో మైక్రోసాఫ్ట్ తమ చాట్ బాట్ లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్ సైతం కొత్త...

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్నాయి. చాట్ జీపీటీ సేవలు సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఎలాంటి సమాచారమైనా క్షణాల్లో తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికే చాట్ జీపీటీ తరహా సేవలను ఇతర కంపెనీలు సైతం తీసుకొస్తున్నాయి. గూగుల్ ఇప్పటికే ‘బార్డ్ ఏఐ’ పేరుతో ఏటా చాట్‌బాట్ సేవలను తీసుకొచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి అమెజాన్ కూడా వచ్చి చేరింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సైతం ఏఐ చాట్ బాట్‌ను తీసుకొస్తోంది. చాట్ జీపీటీ తరహాలో ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్ చేయనుంది. అమెజాన్ క్యూ పేరుతో ఈ చాట్‌బాట్‌ను తీసుకురానున్నారు. ఇప్పటికే బార్డ్ పేరుతో గూగుల్, ఓపెన్ పేరుతో మైక్రోసాఫ్ట్ తమ చాట్ బాట్ లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్ సైతం కొత్త ఏఐ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది..
ఈ కొత్త టూల్‌ను ‘కొత్త రకం జనరేటివ్ AI పవర్డ్ అసిస్టెంట్’ అని ఆమెజాన్ చెబుతోంది. అమెజాన్ ఈ టూల్‌ను ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించారు. ఇది వ్యాపారస్తుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. కంటెంట్‌ను రూపొందించగలదు. డేటాను ఉపయోగించి వివిధ ఆప్షన్స్ ను సూచించగలదని అమెజాన్ చెబుతోంది. ఇంతకీ వ్యాపారులకు ఈ ఏఐ టూల్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కస్టమర్లు తమ వ్యాపారానికి అనుగుణంగా ఈ చాట్ బాట్‌ను ఉపయోగించుకోవచ్చు. సంస్థ సమాచార రిపోజిటరీలు, కోడ్, డేటా, ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్‌లకు కనెక్ట్ చేయడం ద్వారా చాట్ బాట్ సేవలను వాడుకోవచ్చు. వ్యాపారాస్తులకు అవసరమైన కంటెంట్‌ను రూపొందించడానికి, ఇన్‌సైట్స్ పొందడానికి ఉపయోగపడుతుంది. అలాగే సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పనులను కేటాయించడానికి, వేగంగా నిర్ణయాలు ఈసుకోవడానికి, సమస్యల పరిష్కారానికి, పనిలో అవసరమైన క్రియేటివిటీని పెంచుకోవడానికి అవసరమైన సలహాలను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




