AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI వస్తే మన ఉద్యోగాలు ఏమవుతాయి? భయపడాలా.. లేక సిద్ధమవ్వాలా? నిన్నటి వార్త మనందరికీ ఓ పాఠం!

Artificial Intelligence: టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం నిద్రపోతున్నా, మార్పు మాత్రం ఆగదు. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కుమ్మరిస్తుంది మన ఆశల మీద కాదు.. రాబోయే మార్పు మీద! ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. కంప్యూటర్లు వచ్చినప్పుడు, బ్యాంక్ ఉద్యోగులు ధర్నాలు..

AI వస్తే మన ఉద్యోగాలు ఏమవుతాయి? భయపడాలా.. లేక సిద్ధమవ్వాలా? నిన్నటి వార్త మనందరికీ ఓ పాఠం!
Ai
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Feb 13, 2026 | 1:04 PM

Share

AI: నిన్నటికి నిన్న ఒక వార్త ప్రపంచాన్ని ఆకర్షించింది. ‘ఆంథ్రోపిక్’ (Anthropic) అనే AI కంపెనీకి ఇన్వెస్టర్లు దాదాపు 30 బిలియన్ డాలర్లు (అక్షరాలా 2.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టారు. కేవలం కొన్ని ఏళ్ల క్రితం పుట్టిన ఒక కంపెనీ విలువ, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల కంటే ఎక్కువైంది.

ఇక్కడ మనం గమనించాల్సింది డబ్బు గురించి కాదు.. నమ్మకం గురించి. అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు డబ్బు పెడుతున్నారంటే వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. “AI అనేది ఏదో వచ్చిపోయే గాలివాన కాదు.. ఇది భవిష్యత్తు పునాది” అని. మరి ఆ విషయం మనకు అర్థమైందా?

సామాన్యుడి సందేహం.. నిపుణుల నమ్మకం

ఇవి కూడా చదవండి

ఈ రోజుల్లో టీవీల్లో, ఆఫీసుల్లో, నలుగురు కలిసినప్పుడు తరచుగా వినిపించే మాటలు:

“ఎంతైనా మనిషి టచ్ వేరు కదా.. AI కి అది ఎక్కడి నుంచి వస్తుంది?”

“ప్రభుత్వాలు దీనికి కళ్లెం వేస్తాయిలే..”

“నా జాబ్ చాలా సేఫ్, కంప్యూటర్ నా పని చేయలేదు.”

ఇలా అనుకోవడం తప్పు కాదు, అది మన ఆశ. కానీ వాస్తవం ఏంటంటే.. టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం నిద్రపోతున్నా, మార్పు మాత్రం ఆగదు. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కుమ్మరిస్తుంది మన ఆశల మీద కాదు.. రాబోయే మార్పు మీద!

చరిత్ర ఏం చెబుతోంది?

ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. కంప్యూటర్లు వచ్చినప్పుడు, బ్యాంక్ ఉద్యోగులు ధర్నాలు చేశారు. ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. కానీ ఏం జరిగింది? కంప్యూటర్ల వల్ల పని వేగం పెరిగింది. కొత్తగా లక్షల ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల విషయంలోనూ ఇదే జరిగింది. ప్రతిసారీ “ఇది మన వల్ల కాదు” అన్నవాళ్లు వెనకబడిపోయారు. “దీనిని ఎలా వాడాలో నేర్చుకుందాం” అన్నవాళ్లు ఎదిగారు. ఇప్పుడు AI వంతు వచ్చింది.

  • AI ని శత్రువులా చూడొద్దు.. అదొక సూపర్ పవర్!
  • AI ని చూసి భయపడాల్సిన పనిలేదు. ఇది మన ఉద్యోగాన్ని లాక్కునే శత్రువు కాదు.. మన పనిని తేలిక చేసే ఒక అద్భుతమైన శక్తి (Super Power).
  • ఉదాహరణకు.. మీరు ఒక బరువును మోసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. AI అనేది ఒక సైకిల్ లేదా బైక్ లాంటిది.
  • నడక మానేసి, ఆ బైక్ నడపడం నేర్చుకుంటే.. మీరు అనుకున్న గమ్యానికి పదింతలు వేగంగా వెళ్తారు.
  • అదే “నేను పాత పద్ధతిలోనే నడుస్తాను” అంటే.. బైక్ మీద వెళ్ళేవాడు మిమ్మల్ని దాటి వెళ్లిపోతాడు. అంతే తేడా!

ఐటీ మిత్రులకు చిన్న సూచన..

ముఖ్యంగా మన సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న మిడిల్ క్లాస్ ఉద్యోగులు గమనించాలి. ఇప్పుడు వస్తున్న AI టూల్స్ (Claude, ChatGPT వంటివి) అసిస్టెంట్లుగా మారిపోయాయి. కోడింగ్, మెయిల్స్, ఎనాలిసిస్ చిటికెలో చేస్తున్నాయి.

దీని అర్థం మనుషులు అవసరం లేదని కాదు.. “స్మార్ట్” మనుషులు కావాలని! ఒక చేదు నిజం చెప్పనా? “AI మీ ఉద్యోగాన్ని తీసేయదు. కానీ, AIని ఎఫెక్టివ్ గా వాడటం వచ్చిన మరో మనిషి. మీ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది.” సో, మనం పోటీ పడాల్సింది AI తో కాదు.. మనలోని అజ్ఞానంతో.

ఇది Y2K లాంటి అద్భుత అవకాశం!

2000 సంవత్సరంలో Y2K సమస్య వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. కానీ ఆ సమస్య నుంచే మన దేశంలో ఐటీ విప్లవం వచ్చింది. ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల తలరాతలు మారాయి. ఇప్పుడు AI కూడా అంతే. ఇది పాత పద్ధతులను మార్చేస్తుంది. కానీ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. హెల్త్, టీచింగ్, ఫైనాన్స్.. ఇలా ఏ రంగం తీసుకున్నా AI నిపుణుల అవసరం రాబోతోంది. మనం చేయాల్సిందల్లా సిద్ధంగా ఉండటమే.

మనం ఏం చేయాలి? (సింపుల్ చిట్కాలు):

  • భయపడితే పరిష్కారం దొరకదు, ఆలోచిస్తే దొరుకుతుంది.
  • మారనివ్వండి: “AI వస్తే కష్టం” అని వాదించడం మానేసి, “నా పనిలో దీన్ని ఎలా వాడాలి?” అని ఆలోచించండి.
  • స్నేహం చేయండి: రోజుకు ఒక 15 నిమిషాలు కేటాయించి కొత్త AI టూల్స్ ఏమొచ్చాయో చూడండి. వాటితో ప్రయోగాలు చేయండి.
  • అప్‌డేట్‌ అవ్వండి: డిగ్రీలు ముఖ్యం కాదు, స్కిల్స్ ముఖ్యం. నిరంతరం నేర్చుకునేవాడికి ఏ టెక్నాలజీ వచ్చినా ఢోకా ఉండదు.

చివరిగా ఒక మాట..

మార్పు అనేది ఆపితే ఆగేది కాదు. అది సముద్రపు అల లాంటిది. దానిని చూసి భయపడి పారిపోదామా? లేక ఆ అల మీద సర్ఫింగ్ చేస్తూ.. కెరీర్ లో ఎత్తుకు ఎదుగుదామా? నిర్ణయం మీదే!

గుర్తుంచుకోండి: గెలిచేది తెలివైనవాడు కాదు.. ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మారినవాడు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us