Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Passkeys: పాస్‌వర్డ్‌లకు స్వస్తి! పాస్‌కీ వచ్చేసింది.. ఇక అన్నీ దీనితోనే.. పూర్తి వివరాలు..

పాస్ వర్డ్ ని ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకున్నా.. సైబర్ దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో మరో కొత్త ఆవిష్కరణ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. సరిగ్గా అలాంటి సమయంలో అమెజాన్ పాస్ వర్డ్ స్థానంలో ‘పాస్‌కీస్’ ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే యాపిల్, గూగుల్, మెటా ఈ పాస్ వర్డ్ లకు స్వస్తి చెప్పేందుకు ఇప్పటికే కొత్త ఆవిష్కరణలపై వైపు సాగుతున్నాయి. ఇప్పుడు వాటి సరసన అమెజాన్ కూడా చేరింది. దీంతో ఇక పాస్ వర్డ్ కాలానికి ముగింపు పలికినట్టేనని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Amazon Passkeys: పాస్‌వర్డ్‌లకు స్వస్తి! పాస్‌కీ వచ్చేసింది.. ఇక అన్నీ దీనితోనే.. పూర్తి వివరాలు..
Amazon Passkeys
Follow us
Madhu

|

Updated on: Oct 25, 2023 | 5:05 PM

పాస్ వర్డ్.. ఇది తెలియని వారుండరు. ఆన్ లైన్ లో నిర్వహించే ప్రతి పనికి, ప్రతి ఖాతాకు అది సోషల్ మీడియా అయినా, బ్యాంక్ ఖాతా అయినా మరేదైనా.. పాస్ వర్డ్ తప్పనిసరి. ఈ పాస్ వర్డ్ ను ఎంత ధృడంగా పెట్టుకుంటే అంత సెక్యూరిటీ ఉంటుందని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు. అయితే ఈ పాస్ వర్డ్ ని ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకున్నా.. సైబర్ దాడులు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో మరో కొత్త ఆవిష్కరణ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. సరిగ్గా అలాంటి సమయంలో అమెజాన్ పాస్ వర్డ్ స్థానంలో ‘పాస్‌కీస్’ ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే యాపిల్, గూగుల్, మెటా ఈ పాస్ వర్డ్ లకు స్వస్తి చెప్పేందుకు ఇప్పటికే కొత్త ఆవిష్కరణలపై వైపు సాగుతున్నాయి. ఇప్పుడు వాటి సరసన అమెజాన్ కూడా చేరింది. దీంతో ఇక పాస్ వర్డ్ కాలానికి ముగింపు పలికినట్టేనని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వినియోగదారులు ఇప్పుడు పాస్‌కీలను ఉపయోగించి లాగిన్ అవ్వడానికి, తమకు కావలసిన వాటి కోసం షాపింగ్ చేయవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాస్‌కీలు అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వినియోగదారులకు వీటి వల్ల ప్రయోజనం ఏమిటి? తెలుసుకుందాం రండి..

పాస్‌కీ అంటే ఏమిటి..

లాగిన్ చేయడానికి మరింత సురక్షితమైన మార్గం ఈ పాస్ కీ. యాప్‌లు, వెబ్‌సైట్‌లను సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించడానికి సులభమైన కొత్త మార్గంగా పాస్‌కీలు ఉంటాయి. పాస్‌వర్డ్‌లకు సురక్షితమైన, అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. పాస్‌వర్డ్‌ల వలె దీనిని ఎవరూ షేర్ చేయలేరు. తద్వారా హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు వీటిని ఛేదించలేరు. ఎందుకంటే ఈ పాస్ కీలను రాయడం, ఊహించడం చాలా కష్టం. వినియోగదారులు తమ పరికరాలను వేలిముద్ర, ఫేస్ స్కాన్ లేదా లాక్ స్క్రీన్ పిన్‌తో అన్‌లాక్ చేసిన విధంగానే అమెజాన్ వంటి యాప్‌లు సైట్‌లకు సైన్ ఇన్ చేయడానికి పాస్‌కీలను ఉపయోగించవచ్చు. ఇది పాస్‌వర్డ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లలోని వన్-టైమ్ కోడ్‌ల కంటే ఫిషింగ్ దాడులకు తక్కువ అవకాశం కలిగిస్తుంది, ఇది తమ కస్టమర్‌లకు మరింత సురక్షితమైన ఎంపికగా చేస్తుంది అని అమెజాన్ తెలిపింది.

ఐఫోన్, వెబ్ యూజర్లకు.. ప్రస్తుతం బ్రౌజర్‌లను ఉపయోగించే అమెజాన్ కస్టమర్లందరికీ పాస్‌కీ అందుబాటులో ఉందని అమెజాన ప్రకటించింది. రానున్న రోజుల్లో ఐఓఎస్ డివైజెస్ లోని అమెజాన్ షాపింగ్ యాప్‌లో ఈ పాస్ కీ అనేది అందుబాటులోకి వస్తోందని అమెజాన్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

ఇవి కూడా చదవండి

త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు.. ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ, పాస్‌కీ మద్దతు “ఆండ్రాయిడ్ అమెజాన్ షాపింగ్ యాప్‌లో త్వరలో రాబోతోంది” అని అమెజాన్ తెలిపింది. ప్రస్తుతానికి, ఎంపిక చేసిన బ్రౌజర్‌లు, పరికరాలలో ఎంపిక చేసిన కస్టమర్‌లకు మాత్రమే పాస్‌కీ ప్రస్తుతం అందుబాటులో ఉందని అమెజాన్ తెలిపింది.

అమెజాన్‌లో పాస్‌కీని ఎలా సెట్ చేయాలి..

ఇది చాలా సులభం. కొన్ని దశలను అనుసరించాల్సిన అవసరం ఉంది. పాస్‌కీ అప్‌డేట్‌తో వారి బ్రౌజర్ లేదా ఐఓఎస్ అమెజాన్ షాపింగ్ యాప్‌ని ఉపయోగించి, కస్టమర్‌లు “మీ ఖాతా”ని ఎంచుకోవచ్చు, “లాగిన్ అండ్ సెక్యూరిటీ”ని ఎంచుకోవచ్చు, పాస్‌కీల పక్కన ఉన్న “సెటప్”ని ఎంచుకుని, త్వరిత దశల వారీ సూచనలను అనుసరించండి. అమెజాన్ చెబుతున్న దాని ప్రకారం, పాస్‌వర్డ్ రీసెట్ పాస్‌కీలను ప్రభావితం చేయదు. పాస్‌కీలు ఖాతా పాస్‌వర్డ్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి కాబట్టి, ఖాతాను సైన్ ఇన్ చేయడానికి ఇప్పటికీ పాస్‌కీలను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు కొత్త పరికరం నుంచి అమెజాన్ కి సైన్ ఇన్ చేస్తున్నప్పుడు, పాస్‌కీ ఎంపిక స్వయంచాలకంగా సైన్-ఇన్ ఎంపికగా ప్రదర్శించబడుతుంది. పాస్‌కీ స్వయంచాలకంగా ప్రదర్శించబడకపోతే, పాస్‌కీతో సైన్ ఇన్ ఎంచుకోండి. పాస్‌కీని ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి మీ ఫేస్ ఐడీ, వేలిముద్ర లేదా పరికరం పిన్ ని ఉపయోగించమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు.

ఇక పాస్ వర్డ్‌లు ఉండవా..

పాస్ వర్డ్ ఇక అంతం అయిపోయినట్లే అని చాలా మంది భావిస్తున్నారు. కానీ పాస్‌వర్డ్‌లు భవిష్యత్తులోనూ ఉంటాయని అమెజాన్ తెలిపింది. అయితే కొత్త టెక్నాలజీని అదనపు భద్రత కోసం తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కాగా ఈ పాస్ కీలు ఇప్పటికే యాపిల్, గూగుల్ వంటి యాప్ వినియోగంలోకి తెచ్చాయి. అయితే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కూడా ఈ పాస్ కీలకు సపోర్టు ఇస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..