- Telugu News Photo Gallery Technology photos Samsung launches new smart phone samsung galaxy a05s check here for features and price details
Galaxy A05s: సామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రూ. 14 వేలలోనే 50 ఎంపీ కెమెరా..
దేశంలో పండుగల సీజన్‌లో నేపథ్యంలో కొత్త ఫోన్‌లు లాంచ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్‌ను ఎక్కువగా తీసుకొస్తున్నారు. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజాలే కాకుండా సామ్‌సంగ్ వంటి బ్రాండ్ కంపెనీలు సైతం బడ్జెట్ ధరలోనే ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 25, 2023 | 2:06 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్యాలక్సీ ఏ05ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,999గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1,080x2,4000 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. 50 మెగాపిక్సెల్, 2 ఎంపీ, 2 ఎంపీలతో కూడిన మూడు కెమెరాలు అందించారు. ఇక సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05ఎస్ స్మార్ట్ ఫోన్‌లో 25 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై 802.11, బ్లూటూత్ 5.1 ఏ2డీపీ, ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్‌సీ 2.0 వంటి ఫీచర్స్‌ను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వంటి సెక్యూరిటీ ఫీచర్‌ను ఇచచారు. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్, వాయిలెట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.





























