Apple Scary Fast: యాపిల్ ‘స్కేరీ ఫాస్ట్’ ఈవెంట్‌కి ముహూర్తం ఫిక్స్.. క్యూ కట్టనున్న కొత్త ఉత్పత్తులు..
గ్లోబల్ దిగ్గజం యాపిల్ ఓ ప్రత్యేకమైన ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దానికి ‘స్కేరీ ఫాస్ట్’ అని పేరు పెట్టింది. అక్టోబర్ 30వ తేదీని దీనిని నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో ఐమ్యాక్ కంప్యూటర్లు, మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ లను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి దీనికి సంబంధించిన పుకార్లు చాలానే వ్యాపించాయి. ఈ క్రమంలో స్కేరీ ఫాస్ట్ పేరుతో యాపిల్ ఈవెంట్ కుసంబంధించి ఇన్వైట్స్ పంపడంతో ఈ రూమర్లను నిర్ధారించినట్లు అయ్యింది.

టాప్ బ్రాండ్లు నిర్వహించే లాంచింగ్ ఈవెంట్లపై అందరికీ ఆసక్తి ఉంటుంది. కొత్త ఉత్పత్తులు ఏం వస్తున్నాయి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వాటిలో ఆప్షన్లు ఏంటి? అని తెలుసుకొనేందుకు అవి ఉపయోగపడతాయి. ఆటో మొబైల్స్ ఇండస్ట్రీ నుంచి టెక్ దిగ్గజాల వరకూ ఈ లాంచింగ్ ఈవెంట్లు నిర్వహిస్తుంటాయి. ఇదే క్రమంలో గ్లోబల్ దిగ్గజం యాపిల్ ఓ ప్రత్యేకమైన ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దానికి ‘స్కేరీ ఫాస్ట్’ అని పేరు పెట్టింది. అక్టోబర్ 30వ తేదీని దీనిని నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో ఐమ్యాక్ కంప్యూటర్లు, మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ లను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి దీనికి సంబంధించిన పుకార్లు చాలానే వ్యాపించాయి. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ఆ రూమర్లను ధ్రువీకరించింది. యాపిల్ సంస్థ ఈ నెలలోనే మ్యాక్స్ డివైజ్ ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో స్కేరీ ఫాస్ట్ పేరుతో యాపిల్ ఈవెంట్ కు సంబంధించి ఇన్వైట్స్ పంపడంతో ఈ రూమర్లను నిర్ధారించినట్లు అయ్యింది. ఈ ఈవెంట్లో కొత్త మ్యాక్స్, ఐమ్యాక్స్, మరిన్ని ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈవెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు యాపిల్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ కొత్త అంశాలు ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ ఇలా.. యాపిల్ సంస్థ ఈ స్నేరీ ఫాస్ట్ ఈవెంట్ ను ఆన్ లైన్ లోనే నిర్వహించనుంది. అక్టోబర్ 30 సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ఆరంభమవుతుందని యాపిల్ చెప్పింది. మన దేశంలో అక్టోబర్ 31 ఉదయం 5.30 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. యాపిల్ అధికారిక వెబ్ సైట్ , యాపిల్ యూట్యూబ్ చానల్ ద్వారా ఈ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ ను చూడొచ్చు.
స్కేరీ ఫాస్ట్ లో లాంచ్ కానున్న ఉత్పత్తులు ఇవే.. యాపిల్ నుంచి ఎం3 చిప్ తో రానున్న కొత్త మ్యాక్ బుక్ ల్యాప్ టాప్స్, ఐమ్యాక్స్ కంప్యూటర్ల ఈ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్లో యాపిల్ ఆవిష్కరించనుంది. యాపిల్ నుంచి వచ్చిన చివరి మోడల్ ఐమ్యాక్ మొదటి తరం ఎం1 చిప్ తో వచ్చింది. అయితే దీనిని ఇప్పటి వరకూ యాపిల్ అప్ గ్రేడ్ చేయలేదు. దీనిని ఇప్పుడు అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే 13 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో ల్యాప్ టాప్ ను కూడా అప్ డేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మ్యాక్ బుక్ ప్రో ఎడిషన్లను కూడా ఎం3 చిప్ తో కొత్త వేరియంట్లు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐప్యాడ్ ల గురించి కూడా రూమర్స్ వచ్చాయి గానీ ఈ స్కేరీ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్లు కంపెనీ లాంచ్ చేసే అవకాశం లేదని చెబుతున్నారు. 2024లో అవి మార్కెట్లోకి వచ్చే చాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..