Smartphone: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారా? ఈ 3 విషయాలను తప్పకుండా తనిఖీ చేయండి
స్మార్ట్‌ఫోన్ రిఫ్రెష్ రేట్ గురించి చాలా మందికి తెలియదు. చాలా తక్కువ మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు రిఫ్రెష్ రేట్‌ని చెక్ చేస్తారు. అయితే దీన్ని చెక్ చేసుకోకుండా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మీ డబ్బు వృథా అవుతుంది. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. రిఫ్రెష్ రేట్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వేగాన్ని ప్రతిబింబిస్తుంది. రిఫ్రెష్ రేట్ మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ఎంత వేగంగా పని చేస్తుందో, ఎంత సున్నితంగా ఉందో..

నేడు మార్కెట్‌లో వారానికి కనీసం మూడు నుంచి నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. ఇవి తక్కువ ధరలకు లభిస్తుండడంతో భారీ విక్రయాలు కూడా జరగనున్నాయి. కానీ, చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు కొనడానికి వెళ్లినప్పుడు, వారు మొదట తనిఖీ చేసేది దాని కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, ర్యామ్. అయితే, ఈ ఫీచర్లు కాకుండా, స్మార్ట్‌ఫోన్‌లో మీరు ఖచ్చితంగా చూడవలసిన కొన్ని విషయాలు ఉన్నాయని మీకు తెలుసా?. చెక్ చేసుకోకుండా కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే అది వేస్ట్ అని చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు మీరు పరిశీలించాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకోండి.
ఏదైనా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు Specific Absorption Rate (SAR) (నిర్దిష్ట అబ్సార్ప్షన్ రేట్) ద్వారా కొలవబడుతుంది. అంటే ఫోన్ విడుదల చేసే రేడియేషన్. ఫోన్ SAR విలువ ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రమాదకరం. భారతదేశంలో విక్రయించబడే ఫోన్‌ల ఎస్‌ఏఆర్ విలువ కిలోగ్రాముకు గరిష్టంగా 1.6 వాట్స్‌గా సెట్ చేయబడింది. మీ ఫోన్‌లో *#07# డయల్ చేయడం ద్వారా ఈ మొబైల్ ఎస్‌ఏఆర్ విలువను తెలుసుకోవచ్చు. మీ ఫోన్ SAR విలువ పేర్కొన్న రేటు కంటే ఎక్కువగా ఉంటే అది ప్రమాదకరం.
ఫోన్ రిఫ్రెష్ రేట్:
స్మార్ట్‌ఫోన్ రిఫ్రెష్ రేట్ గురించి చాలా మందికి తెలియదు. చాలా తక్కువ మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు రిఫ్రెష్ రేట్‌ని చెక్ చేస్తారు. అయితే దీన్ని చెక్ చేసుకోకుండా స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మీ డబ్బు వృథా అవుతుంది. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. రిఫ్రెష్ రేట్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే వేగాన్ని ప్రతిబింబిస్తుంది.
రిఫ్రెష్ రేట్ మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ఎంత వేగంగా పని చేస్తుందో, ఎంత సున్నితంగా ఉందో నిర్ణయిస్తుంది. సాధారణంగా, మీరు బడ్జెట్ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు, దాని రిఫ్రెష్ రేట్ 60 నుంచి 90 Hz వరకు ఉంటుంది. ఈ రిఫ్రెష్ రేట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌కు మంచిదిగా పరిగణించబడుతుంది.
మీరు మిడ్-రేంజ్ లేదా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, దాని రిఫ్రెష్ రేట్ 90 నుండి 120 హెర్ట్జ్ మధ్య ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో, దీని కంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్‌తో స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. కానీ చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు 120 హెర్ట్జ్‌లో విడుదల అవుతున్నాయి. మీరు మిడ్-రేంజ్ లేదా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తుంటే, దాని రిఫ్రెష్ రేటు 60 Hz ఉంటే, మీ డబ్బు వృధా అవుతుంది. అందుకే కనీసం 90 హెర్ట్జ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయండి.
ఛార్జింగ్ సపోర్ట్:
మీరు మిడ్-రేంజ్ లేదా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తుంటే, కనీసం 60 నుండి 80 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి. మీరు దీని కంటే తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఛార్జ్ చేయడానికి 1 గంట నుండి గంటన్నర సమయం పట్టవచ్చు. 60 నుండి 80 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ అరగంట నుండి పావు గంటలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి