Smart TV: స్మార్ట్ టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10 వేలలో 32 ఇంచెస్ టీవీలు..
దసరా, దీపావళి పండుగలను క్యాష్ చేసుకునేందుకుగాను ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోనూ భారీ ఆఫర్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇక ఈ సేల్‌లో ఈ స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లను అందిస్తున్నారు. మరి ఈ సేల్‌లో రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న టీవీలు, వాటి ఫీచర్లు, ధరల వివరాలపై ఓ లుక్కేయండి..

దసరా, దీపావళి పండుగలను క్యాష్ చేసుకునేందుకుగాను ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోనూ భారీ ఆఫర్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇక ఈ సేల్‌లో ఈ స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లను అందిస్తున్నారు. మరి ఈ సేల్‌లో రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న టీవీలు, వాటి ఫీచర్లు, ధరల వివరాలపై ఓ లుక్కేయండి..
MI 80 cm (32 inches): అమెజాన్‌లో సేల్‌లో తక్కువ ధరకు లభిస్తోన్న టీవీల్లో ఎమ్‌ఐ కంపెనీకి చెందిన 32 ఇంచెస్ ఒకటి. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 24,999కాగా 58 శాతం డిస్కౌంట్‌లో భాగంగా కేవలం రూ. 10,490కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ విషయానికొస్తే ఇందులో ఇందులో 20 వాట్స్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో ఫీచర్స్ ఇచ్చారు. 1.5 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‌ను అందించారు.
VW 80 cm (32 inches): ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 16,999కాగా, ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌లో భాగంగా కేవలం రూ. 7499కే సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు ఇందులో 720పీ రిజల్యూజన్‌తో స్క్రీన్ ఇచ్చారు. ఈ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, సోనీ లివ్, వూట్ టీవీ, హాట్‌స్టార్, యూట్యూబ్, హంగామా ప్లే వంటి ఓటీటీలకు సపోర్ట్ చేస్తుంది. ఈఎమ్‌ఐ ఆప్షన్ ద్వారా నెలకు రూ. 364 చెల్లిస్తూ టీవీని సొంతం చేసకోవచ్చు.
Kodak 80 cm (32 inches): కొడాక్ కంపెనీకి చెందిన ఈ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 14,999కాగా ఏకంగా 43 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,499కి సొంతం చేసుకునే అవకాశం పొందొచ్చు. ఈ టీవీలో 920పీ రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ప్రైమ్ వీడియో, జీ5, యూట్యూబ్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ అవుట్‌పుట్, సరౌండ్ సౌండ్ ఫీచర్‌ను అందించారు. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.
Acer 80 cm (32 inches): అసర్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 19,990కాగా, 45 శాతం డిస్కౌంట్‌లో భాగంగా 10,999కే సొంతం చేసుకోవచ్చు. 720పీ రిజల్యూషన్‌తో తీసుకొచ్చిన ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీలో డ్యూయల్ బాండ్ వైఫై, 2వే బ్లూటూత్, 24 వాట్స్ అవుట్‌పుట్ సౌండ్ వంటి ఫీచర్స్‌ను అందించారు.
SANSUI 80 cm (32 inches): సాన్‌సూయ్ కంపెనీకి చెందిన ఈ గూగుల్ టీవీ అసలు ధర రూ. 21,490కాగా, 49 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 10,990కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌వీడియో, గూగుల్ ప్లే, యూట్యూబ్, డిస్నీ+హాట్‌స్టార్ వంటి యాప్స్‌కు టీవీ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, బిల్ట్ ఇన్ క్రోమ్‌కాస్ట్, వాయిస్ సెర్చ్ రిమోట్ వంటి ఫీచర్స్‌ను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..