Telegram Malware: టెలిగ్రామ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసే వారికి అలెర్ట్.. మీ ఫోన్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టే..!

|

Jul 25, 2024 | 4:30 PM

భారతదేశంలో వాట్సాప్‌కు పోటీగా తీసుకొచ్చిన్న టెలిగ్రామ్ యాప్ ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది. ముఖ్యంగా మనం పంపే ఫైల్ సైజ్ ఎంత ఉన్నా టెలిగ్రామ్‌లో ఈజీగా పంపుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది టెలిగ్రామ్‌ను వాడుతున్నారు. అలాగే క్వాలిటీ మిస్ అవ్వకుండా వీడియోలు సెండ్ చేయాలంటే టెలీగ్రామ్‌ను యువత అధికంగా వాడుతున్నారు. అయితే టెలీగ్రామ్ ద్వారా వీడియోలు డౌన్‌లోడ్ చేసే వారికి ఈఎస్ఈటీ పరిశోధకులు షాక్ ఇచ్చారు.

Telegram Malware: టెలిగ్రామ్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసే వారికి అలెర్ట్.. మీ ఫోన్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టే..!
Telegram Malware
Follow us on

భారతదేశంలో వాట్సాప్‌కు పోటీగా తీసుకొచ్చిన్న టెలిగ్రామ్ యాప్ ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది. ముఖ్యంగా మనం పంపే ఫైల్ సైజ్ ఎంత ఉన్నా టెలిగ్రామ్‌లో ఈజీగా పంపుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది టెలిగ్రామ్‌ను వాడుతున్నారు. అలాగే క్వాలిటీ మిస్ అవ్వకుండా వీడియోలు సెండ్ చేయాలంటే టెలీగ్రామ్‌ను యువత అధికంగా వాడుతున్నారు. అయితే టెలీగ్రామ్ ద్వారా వీడియోలు డౌన్‌లోడ్ చేసే వారికి ఈఎస్ఈటీ పరిశోధకులు షాక్ ఇచ్చారు. టెలీగ్రామ్ వీడియోల ద్వారా ఈవిల్ వీడియో అనే మాల్‌వేర్ మీ ఫోన్‌లో ప్రవేశించి మీ ఫోన్‌లోని సమాచారాన్ని మొత్తం దుండగులకు చేరవేసే ప్రమాదం ఉందని వారు గుర్తించారు. అందువల్ల టెలీగ్రామ్ యూజర్లను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవిల్ వీడియో మాల్‌వేర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పరిశోధకులు టెలీగ్రామ్ 10.14.4 లేదా అంతకంటే పాత వెర్షన్లను వాడే వారికి ఈ ముప్పు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా రూపొందించిన మల్టీమీడియా ఫైల్స్‌ను చాట్స్ లేదా ఛానెల్స్‌లో దుండగులు అప్‌లోడ్ చేస్తున్నారు. అనుకోకుండా ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ యాప్ అయిన మాల్వేర్ మల్టీమీడియా ప్రివ్యూగా కనిపిస్తుంది. పైగా ఇది బైనరీ అటాచ్‌మెంట్ రూపంలో కూడా కనిపించడం లేదని పరిశోధకులు గుర్తించారు. ఈ హానికరమైన ఫైల్ 30 సెకన్ల వీడియోలా కనిపిస్తోంది. పైగా ఈ ఫైల్ డిఫాల్ట్‌గా డౌన్‌లోడ్ అయ్యేలా ముష్కరులు టెలీగ్రామ్ సెట్టింగ్స్‌ను సెట్ చేశారు. వినియోగదారు సంబంధిత చాట్‌ను తెరిచిన వెంటనే ఈ మాల్వేర్ డౌన్‌లోడ్ అవుతుంది. 

టెలిగ్రామ్ యూజర్ వీడియో మీడియా ఫైల్‌ను క్లిక్ చేశాక, యాప్ ఎర్రర్ చూపిస్తుంది. అంటే తెలివిగా టెలీగ్రామ్ యాప్ ఎర్రర్ వచ్చిందనేలా వీడియో ప్లే అవుతుంది. ఒకవేళ యూజర్ కంగారు పడి యాక్సెప్ట్ ఆప్షన్’ను ఎంచుకుంటే థర్డ్ పార్టీ పర్మిషన్ అడుగుతుంది. ఎప్పుడైతే యూజర్ దాన్ని ఓకే చేసి ఓపెన్ చేస్తాడో ఇక అంతే ఆ యాప్‌కు మీరు అన్ని పర్మిషన్లు ఇచ్చేసినట్లే. ఈ యాప్ ఇన్స్టాలేషన్ టెలిగ్రామ్ వినియోగదారుకు ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి యూజర్లకు కచ్చితంగా టెలీగ్రామ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..