Smartphone: స్మార్ట్‌ఫోన్లపై ప్రజల్లో మోజు తీరిందా.? భారీగా తగ్గుతోన్న అమ్మకాలు దేనికి సంకేతం.?

మొబైల్ ఫోన్ అనేది ప్రతీ మనిషికి నిత్యావసరంగా మారిపోయింది. లెక్కబెట్టాలే గాని ఇప్పుడు ఇంటికో అరడజను ఫోన్ల దాకా ఉంటాయి. ఇంత స్పీడుగా ఎదిగిపోతున్న మొబైల్ ఫోన్ల ఇండస్ట్రీకి ఊహించని షాకింగ్ న్యూస్..! మరో నాలుగేళ్లలో కథ క్లయిమాక్స్‌కి చేరుతుందనేది బ్రేకింగ్ న్యూస్. టూ స్మార్ట్ ఐపోతున్న ఫోన్ల పరిశ్రమను..

Smartphone: స్మార్ట్‌ఫోన్లపై ప్రజల్లో మోజు తీరిందా.? భారీగా తగ్గుతోన్న అమ్మకాలు దేనికి సంకేతం.?
Smartphone
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 25, 2023 | 9:52 PM

మొబైల్ ఫోన్ అనేది ప్రతీ మనిషికి నిత్యావసరంగా మారిపోయింది. లెక్కబెట్టాలే గాని ఇప్పుడు ఇంటికో అరడజను ఫోన్ల దాకా ఉంటాయి. ఇంత స్పీడుగా ఎదిగిపోతున్న మొబైల్ ఫోన్ల ఇండస్ట్రీకి ఊహించని షాకింగ్ న్యూస్..! మరో నాలుగేళ్లలో కథ క్లయిమాక్స్‌కి చేరుతుందనేది బ్రేకింగ్ న్యూస్. టూ స్మార్ట్ ఐపోతున్న ఫోన్ల పరిశ్రమను ఇప్పుడొక సమస్య వెంటాడుతోంది. ఏమిటా సమస్య… ఫోన్ యూజర్ల మైండ్‌సెట్‌లో సడన్‌గా వచ్చిన మార్పులేంటి… దాని పర్యవసానాలు ఎంత దారుణంగా ఉండబోతున్నాయ్…? తెలుసుకుందాం. నిన్నటిదాకా వెయ్యి వెలుగులు విరజిమ్ముతున్న స్మార్ట్ ఫోన్ల పరిశ్రమ… ఇవాళ ప్రమాదపుటంచుల్లో పడింది. మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ భవిష్యత్తుపై కొత్తకొత్త అనుమానాల్ని పుట్టుకొస్తున్నాయి. కారణం… మిడిల్‌ క్లాస్ మేన్‌ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు… దాంతో సన్నగిల్లిన ఫోన్ సేల్స్… తల పట్టుకుని కూర్చున్న స్మార్ట్‌ఫోన్ కంపెనీలు…!

స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్‌పై కౌంటర్‌పాయింట్ అనే రిసెర్చ్ బాడీ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే… షాకైపోవడం గ్యారంటీ. గత ఆరునెలల్లో హ్యాండ్‌సెట్ల అమ్మకాలు భారీ తగ్గిపోయాయ్. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు కూడా కిందకు దిగొచ్చేశాయ్. గత ఏడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే 18 శాతం తక్కువ. దీంతో ఉత్పత్తి చెయ్యాలా వద్దా అనే డైలమాలో పడ్డాయట ఫోన్ కంపెనీలు. దాదాపు 20 శాతం వరకూ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ మీద స్టాప్‌ బటన్ నొక్కేశారు. ఇండియాలోకెల్లా అతిపెద్ద మొబైల్ ఫోన్ రిటైలర్‌గా ఉన్న రిలయన్స్‌ రిటైల్ కూడా ఈ విషయాన్ని ఒప్పేసుకుంది. సో… ఫోన్ల అమ్మకాల్లో మూమెంట్ తగ్గిందన్న చేదునిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందట కంపెనీలకు. స్మార్ట్ ఫోన్ల శకంలో ఇదొక రిమార్కబుల్ పాయింట్. మరొక్క మాటలో చెప్పాలంటే… ఈ డౌన్‌ట్రెండ్ ఆర్థిక మాంద్యానికి ప్రధాన సంకేతం.

ఇక్కడే ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే… లో రేంజ్, మిడిల్‌ రేంజ్ ఫోన్ల సేల్స్‌ మాత్రమే మందగించడం. 8 వేల లోపు ధర పలికే స్మార్ట్‌ఫోన్లు షాపుల్లో షోకేసులకే పరిమితమయ్యాయని, కొనుక్కునే కస్టమర్లు దొరక్క పది వారాల పాటు దిష్టి్బొమ్మల్లా నిలబడిపోయాయని తేలింది. ప్రీమియమ్ బ్రాండున్న కాస్ట్‌లీ ఫోన్ల అమ్మకాలైతే స్థిరంగా ఉన్నాయట. పేదవాడు నానాటికీ ఇంకా నిరుపేదగా మారడం… ధనికుల్లో సంపాదన పెరిగి ఇంకా ధనికుడిగా మారడం… సమాజంలో ఇదొక నిరంతర ప్రక్రియ. డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్ల మధ్య ఇలా పెద్ద గీత ఎలా ఉండేదో… స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విషయంలో కూడా ఇదే రిఫ్లెక్ట్ అవుతోందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. అందుకే… ఖరీదైన టాప్‌ఎండ్ ఫోన్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. లో ప్రొఫైల్ ఫోన్ల సేల్స్‌ మాత్రం మందగించాయి.

ఇండియా నుంచి గత ఏడాది పదిహేను కోట్ల 20 లక్షల ఫోన్లు ఎగుమతయ్యాయి. ఈ ఏడాది మాత్రం 9 శాతం ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోతాయన్నది అంచనా. డిమాండ్‌తో సింక్ అయ్యేలా సప్లయ్ ఉండాలి కనుక… ఉత్పత్తి తగ్గించడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నాయి కంపెనీలు. ప్రొడక్షన్ విషయంలో ఖరీదైన ఫోన్లకే ప్రాధాన్యత ఇవ్వాలని, మీడియం రేంజ్ ఫోన్ల మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ని తగ్గించాలనేది ప్లాన్‌బీ. ఇదే ఆలోచన గనుక అమల్లోకొస్తే కొన్నేళ్ల తర్వాత మామూలు ఫీచర్ ఫోన్లు కనిపించకుండా పోయినా ఆశ్చర్యం లేదు. కొంటే ఖరీదైన ఫోనే కొనాల్సిన అగత్యం ఏర్పడొచ్చు.

నిజానికి… స్మార్ట్‌ఫోన్ల శకంలో ఇండియా నిన్నటిదాకా దూకుడు మీదుండేది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో రారాజుగా ఉన్న డ్రాగన్‌ కంట్రీని వెనక్కు నెట్టాలన్నది మన దేశపు టార్గెట్ కూడా. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇండియాలోనే 31 కోట్లకు పైగా మొబైల్ ఫోన్ల తయారీ జరిగిందని బడ్జెట్ స్పీచ్‌లో ఆర్థికమంత్రి సగర్వంగా ప్రకటించారు. ఇదే ఏడాది కేంద్రం ఇస్తున్న రాయితీల కారణంగా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల విలువ 85 వేల కోట్ల రూపాయలు దాటిపోయింది. కానీ… గత ఆరునెలల నుంచి సీన్ రివర్సైంది. ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోతాయని ఊహించనైనా లేదంటున్నారు మ్యాన్యుఫ్యాక్చరర్స్.

ఇంతకీ… ఇండియాలో లోఎండ్, మీడియం రేంజ్ ఫోన్ల కొనుగోళ్లు ఎందుకు తగ్గినట్టు? ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ కంపల్సరీ అవుతున్న ఈ టైమ్‌లో కన్‌జ్యూమర్లలో ఇలా నిరాసక్తత ఎందుకు ఏర్పడినట్టు? అంటూ స్పెషల్‌గా ఆరా తీస్తున్నారు ఎక్స్‌పర్ట్స్‌. చైనా ఫోన్ల దిగుమతి మీద ఆంక్షలు పెట్టడం… చైనా మేడ్ ఫోన్ల మీద మనోళ్లకు నమ్మకాలు సన్నగిల్లడం కూడా అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏటా 20 శాతం అమ్మకాలు పడిపోవడం అంటే ఆషామాషీ కాదు. ఇదే ట్రెండ్ కంటిన్యూ ఐతే… మరో నాలుగైదేళ్లలో స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీలో పెనుమార్పులు రావడం… కన్‌జ్యూమర్ల మైండ్‌సెట్ కూడా మారడం ఖాయం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..