Letmespy: వెలుగులోకి నయా స్కామ్.. హ్యాకర్ల చేతికి ఆ యాప్ యూజర్ల పర్సనల్ డేటా..
ఫోన్లను ట్రాక్ చేయడానికి ఇటీవల కాలంలో వివిధ యాప్స్ వచ్చాయి. ముఖ్యంగా పిల్లల ఫోన్లపై పేరెంట్ కంట్రోల్ చేయడానికి ఇటీవల కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది తల్లిదండ్రులు ఆ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో లెట్‌మీస్పై అనే యాప్ ఎక్కువ ఆదరణ పొందింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందనే చందాను హ్యాకర్లు లెట్‌మీస్పై యాప్ హ్యాక్ చేసి యూజర్ల డేటా కొట్టేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి ఓ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత పెరిగిన ఆన్‌లైన్ క్లాసుల నేపథ్యంలో పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో వారు స్మార్ట్ ఫోన్‌ను ఎలా వినియోగిస్తున్నారో? అనే భయం వెంటాడుతుంది. అందుకే వాళ్లకు తెలియ వారి ఫోన్లను ట్రాక్ చేయడానికి ఇటీవల కాలంలో వివిధ యాప్స్ వచ్చాయి. ముఖ్యంగా పిల్లల ఫోన్లపై పేరెంట్ కంట్రోల్ చేయడానికి ఇటీవల కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది తల్లిదండ్రులు ఆ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో లెట్‌మీస్పై అనే యాప్ ఎక్కువ ఆదరణ పొందింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందనే చందాను హ్యాకర్లు లెట్‌మీస్పై యాప్ హ్యాక్ చేసి యూజర్ల డేటా కొట్టేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. లెట్‌మీస్పై డేటా చౌర్యం గురించి మరిన్ని విషయాలు ఓ సారి తెలుసుకుందాం.
లెట్‌మీస్పై అనేది ఉద్యోగి లేదా తల్లిదండ్రుల నియంత్రణ కోసం అంటూ ప్రచారం చేసిన ఫోన్ నిఘా యాప్. అదనంగా ఈ సాఫ్ట్‌వేర్ ఫోన్ హోమ్ స్క్రీన్‌లో గుర్తించలేని విధంగా తయారు చేశారు. కనుక ఈ యాప్‌ను కనుగొనడం, అన్‌ఇన్‌స్టాల్ చేయడం సవాలుగా మారుతుంది. తరచుగా స్టాకర్‌వేర్ లేదా స్పౌజ్‌వేర్ అని పిలువబడే ఈ ఫోన్ నిఘా యాప్‌లు వారి ఫోన్‌కు భౌతిక ప్రాప్యతను కలిగి ఉన్న ఇతరులకు యజమానికి తెలియకుండా లేదా ఒప్పందం లేకుండా తరచుగా ఇన్‌స్టాల్ అవుతాయి. జూన్ 21న లెట్‌మీస్పై హ్యాకింగ్ విషయం బయటపడింది. ఈ యాప్‌లో ఉన్న వినియోగదారుల డేటాను హ్యాకర్లు టార్గెట్ చేశారు. ముఖ్యంగా హ్యాకర్లు యూజర్ ఖాతాల ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, సందేశ కంటెంట్ యాక్సెస్ చేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
లెట్‌మీస్పై యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఈ యాప్ ఫోన్‌కు సంబంధించిన టెక్స్ట్ సందేశాలు, కాల్ లాగ్‌లు, కచ్చితమైన లోకేషన్ సమాచారాన్ని దాని సర్వర్‌లకు రహస్యంగా పంపుతుంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన వ్యక్తి నిజ సమయంలో లక్ష్యాన్ని అనుసరించేలా చేస్తుంది. ఈ నిఘా అప్లికేషన్‌లో చాలా బగ్స్ ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి వీలైనంత త్వరగా మీ ఫోన్స్ లెట్‌మీస్పై యాప్ ఉంటే డిలీట్ చేయమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..