బూమ్రా రికార్డును సమంచేసిన య‌జువేంద్ర చాహల్.. కీలకంగా మారిన స్పిన్నర్…

ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న టీ20 లో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ కీలకంగా మారాడు. తన స్పిన్ మాయాజాలంతో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా రికార్డును సమం చేసాడు.

బూమ్రా రికార్డును సమంచేసిన య‌జువేంద్ర చాహల్.. కీలకంగా మారిన స్పిన్నర్...
భారత కెప్టెన్ బౌలింగ్‌లో మార్పులు చేయడం మరో కారణం. పవర్‌ప్లేలోని నాలుగో ఓవర్ వరకు 4 వేర్వేరు బౌలర్లను ఉపయోగించాడు. అక్షర్ పటేల్ మొదటి ఓవర్ వేయగా.. మూడో ఓవర్‌కే యుజ్వేంద్ర చాహల్‌ బరిలోకి దిగాడు. అటు భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్‌లు కూడా చెరో ఓవర్ వేశారు.
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 06, 2020 | 6:07 PM

ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న టీ20 లో సిరీస్‌లో స్పిన్నర్ య‌జువేంద్ర చాహాల్ కీలకంగా మారాడు. తన స్పిన్ మాయాజాలంతో భారత్ తరపున టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా రికార్డును సమం చేసాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా 2-0 తో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెరుపులు మెరిపించారు. మాథ్యూ వేడ్‌ 32 బంతుల్లో58 చేశాడు. మెరపు హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్‌కు ఆస్ట్రేలియా 195 పరుగుల భారీ టార్టెట్‌గా నిర్దేశించింది. ఇక ఇండియా ఆటగాళ్లు ముందు నుంచి దూకుడుగా ఆడుతూ విజయం సాధించారు. ఈ మ్యాచ్ లో యుజ్వేంద్ర చాహాల్ ఒక వికెట్ తీసాడు. ఇప్పటి వరకు బుమ్రా 49 అంతర్జాతీయ టీ20లు ఆడి 59 వికెట్లు సాధించగా..44 టీ20లు ఆడిన చాహల్ 59 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన చాహల్‌ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.