రైతుల ఉద్యమానికి స్టార్ బాక్సర్ బాసట… చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం ఇచ్చిన అవార్డను తిరిగిచ్చేస్తా…

స్టార్ బాక్సర్ విజేందర్ రైతులకు తన మద్దతును తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్టాలను వెనక్కి తీసుకోకపోతే... కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు.

రైతుల ఉద్యమానికి స్టార్ బాక్సర్ బాసట... చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం ఇచ్చిన అవార్డను తిరిగిచ్చేస్తా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 06, 2020 | 4:08 PM

If govt doesn’t withdraw the black laws, I’ll return my Khel Ratna: Vijender కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు నూతన రైతు చట్టాలకు తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాలు రైతులకు మేలు చేసే విధంగా కాకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాచేలా ఉన్నాయని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో తమ నిరసనను వ్యక్తం చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను ఢిల్లీ రాకుండా అడ్డుకుంటోంది. ఇప్పటికే హర్యానా, పంజాబ్ రైతులు హర్యానా – ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున చేరుకుని నిరసనలు, ర్యాలీలు తీస్తున్నారు. డిసెంబర్ 8న భారత్ బంద్‌కు సైతం పిలుపునిచ్చారు.

బాక్సర్ విజేందర్ మద్దతు…

దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా సోనూసూద్ సైతం రైతుల ఉద్యమంపై స్పందించారు. స్టార్ బాక్సర్ విజేందర్ రైతులు సింగు బార్డర్ వద్ద చేపట్టిన ర్యాలీకి హాజరై తన మద్దతును తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చేసిన చట్టాలను వెనక్కి తీసుకోకపోతే… కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డును తిరిగి ఇచ్చేస్తానని కేంద్రాన్ని హెచ్చరించారు. కాగా, రైతులు 11 రోజులుగా ఉద్యమిస్తున్నారు.