AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia 2020 : ధావన్ దూకుడు..హార్దిక్‌ పాండ్య పరుగుల వరద.. టీమిండియా అద్భుత విజయం..

టీమిండియా అద్భుతమైన పోరాటం ఫలించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత‌ ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో..

India vs Australia 2020 : ధావన్ దూకుడు..హార్దిక్‌ పాండ్య పరుగుల వరద.. టీమిండియా అద్భుత విజయం..
Sanjay Kasula
|

Updated on: Dec 06, 2020 | 7:06 PM

Share

టీమిండియా అద్భుతమైన పోరాటం ఫలించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత‌ ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో కైవసం చేసుకున్నది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కేవలం 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. 3ఫోర్లు, 2సిక్సర్లతో వీరవిహారం చేయడంతో టీమిండియా 2 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది.

195 పరుగుల భారీ టార్గెట్‌ను కోహ్లీ సేన ఈజీగా చేజ్ చేసింది. శిఖర్ ధావన్ దూకుడుతో శుభారంభం చేశాడు. ధావన్‌ 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 4ఫోర్లు, 2సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ కూడు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరుపులు మెరిపించి.. 24 బంతుల్లో 40 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌ (30/ 22 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌) జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఆఖర్లో శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌గా నిలిచాడు. 12 నాటౌట్‌: 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ .. పాండ్యకు మంచి సహకారం అందించాడు.

అంతకుముందు ఆసీస్‌ తాత్కాలిక కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ 58/32 బంతుల్లో 10ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకోగా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌(46/ 38 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) కూడా రాణించడంతో 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (22/ 13 బంతుల్లో 2సిక్సర్లు), హెన్రిక్స్‌ (26/18 బంతుల్లో సిక్స్‌) ఫర్వాలేదనిపించారు.

ఆఖర్లో మార్కస్‌ స్టాయినీస్‌ (16) స్కోరును 190 దాటించాడు. భారత బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. చాహల్‌ (1/51) విఫలమవగా..శార్దుల్‌ ఠాకూర్‌(1/39) ఫర్వాలేదనిపించాడు.