కోవిడ్ 19 పై ‘ప్రత్యక్ష పోరుకు’ బ్రిటన్ సిధ్ధం , చరిత్రాత్మక వ్యాక్సినేషన్ కు సమాయత్తం

కరోనా వైరస్ పై 'ప్రత్యక్ష పోరాటానికి' బ్రిటన్ సిధ్ధపడింది. దేశంలో మొదటిసారిగా 50 నేషనల్ హెల్త్ సర్వీస్ ఆసుపత్రులు ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. చరిత్రలోనే ఇదొక భారీ వ్యాక్సినేషన్..

కోవిడ్ 19 పై 'ప్రత్యక్ష పోరుకు' బ్రిటన్ సిధ్ధం , చరిత్రాత్మక వ్యాక్సినేషన్ కు సమాయత్తం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 06, 2020 | 7:11 PM

కరోనా వైరస్ పై ‘ప్రత్యక్ష పోరాటానికి’ బ్రిటన్ సిధ్ధపడింది. దేశంలో మొదటిసారిగా 50 నేషనల్ హెల్త్ సర్వీస్ ఆసుపత్రులు ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. చరిత్రలోనే ఇదొక భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమంగా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పొరుగునున్న బెల్జియం నుంచి నిర్దేశిత ప్రాంతాలకు చేరిన ఈ టీకామందు తొలి డోసును ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ సిబ్బందికి, 80 ఏళ్ళు పైబడినవారికి మొదటి  ప్రాధాన్యంగా ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి తొలి దశలో భాగంగా ఈ హిస్టారిక్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాన్నదని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హాన్ కాక్ తెలిపారు. ఈ టీకామందు పూర్తి సురక్షితమైనదని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ  ఏజెన్సీ ప్రకటించిందన్నారు.

ఈ వారం చరిత్రాత్మక మూమెంట్ అని అభివర్ణించారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతివారూ కృషి చేయాలని తాను కోరుతున్నట్టు మట్ హాన్ కాక్ చెప్పారు. మొదటిదశలో వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ పై గల జాయింట్ కమిటీ దీనికి  ఆమోదం తెలిపిందన్నారు. ఎంపిక చేసిన 50 ఆసుపత్రులకు ఈ నెల 8 నుంచి ఈ టీకామందును సరఫరా చేయనున్నారని . అయితే రానున్న వారాల్లో మరిన్ని హాస్పిటల్స్ కు దీన్ని విస్తృతం చేయనున్నారని తెలిసింది.

94 ఏళ్ళ రెండో ఎలిజిబెత్ రాణి, 99 ఏళ్ళ ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వంటివారికి ఈ మొదటి దశలో టీకామందును ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్ లో గత 24 గంటల్లో 397 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 61,014 కి పెరిగింది.

ఇలా ఉండగా, మొదటివారంలో 8 లక్షల డోసులు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. ప్రతి వ్యక్తికీ రెండు డోసుల టీకా మందు అవసరమని, దేశంలోని 67 మిలియన్ల జనాభాలో 20 మిలియన్ల మందికి ఇది సరిపోతుందని అంచనా వేస్తున్నారు. సైనిక విమానాల ద్వారా కోట్లాది డోసుల వ్యాక్సిన్ దేశానికి చేరనుంది.