AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉమెన్స్ డే రోజు కన్నీళ్లు పెట్టిన భారత మహిళా క్రికెటర్లు..

మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టోర్నమెంట్ అంతటా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికి,  ఫైనల్లో అమ్మాయిలు చేతులెత్తేయడం యావత్ భారతదేశానికి నిరాశపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి.. ఓపెనర్లు అలిస్సా హీలీ (75), బెత్ మూనీ (78 నాటౌట్)  అర్ధ సెంచరీలు చేసి..వారి జట్టు 184 పరుగుల భారీ స్కోర్ చేయడంలో సహాయపడ్డారు. మరోవైపు ఆసిస్ బౌలర్లు  మేగాన్ షుట్ (4/18), జెస్ […]

ఉమెన్స్ డే రోజు కన్నీళ్లు పెట్టిన భారత మహిళా క్రికెటర్లు..
Ram Naramaneni
|

Updated on: Mar 08, 2020 | 8:21 PM

Share

మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టోర్నమెంట్ అంతటా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికి,  ఫైనల్లో అమ్మాయిలు చేతులెత్తేయడం యావత్ భారతదేశానికి నిరాశపరిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి.. ఓపెనర్లు అలిస్సా హీలీ (75), బెత్ మూనీ (78 నాటౌట్)  అర్ధ సెంచరీలు చేసి..వారి జట్టు 184 పరుగుల భారీ స్కోర్ చేయడంలో సహాయపడ్డారు. మరోవైపు ఆసిస్ బౌలర్లు  మేగాన్ షుట్ (4/18), జెస్ జోనాసెన్ (3 / 20) సైతం అదిరిపోయే ప్రదర్శన చేశారు. దీంతో ఐదోసారి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

స్టార్ ఇండియా ఆటగాళ్ళు షఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా వెంటవెంటనే ఔటవ్వడంతో టీమ్ డిఫెన్స్‌లో పడింది. ఒత్తిడిని తట్టుకోలేక భారత్‌ 19.1 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది.  టోర్నమెంట్ అంతటా విపరీతమైన ఫామ్‌లో ఉన్న 16 ఏళ్ల షఫాలి… కేవలం 2 పరుగులతో ఇన్సింగ్స్ మూడో బంతికే వెనుదిరిగింది. ఓటమి అనంతరం షఫాలి భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. స్టేడియంలోనే ఏడుస్తూ కనిపించింది. సహచర క్రీడాకారిణి ఆమెను ఓదార్చింది. తుది పోరులో భారత్ ఓడినప్పటికి, మన అమ్మాయిల పోరాట పటిమను చూసి దేశం మొత్తం ప్రశంసిస్తోంది. తప్పులను వెతుక్కుని మన్ముందు మంచి ప్రదర్శన చెయ్యాలని మరికొందరు క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us
గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే
గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే
అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని సీక్రెట్స్
అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని సీక్రెట్స్
అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు..
అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు..
శార్దూల్ ను ముంబైలోనే బంధించేయాలని ఫిక్స్ అయిపోయిన పాండ్యా
శార్దూల్ ను ముంబైలోనే బంధించేయాలని ఫిక్స్ అయిపోయిన పాండ్యా
అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన
అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన
రూ.1,47,760 జీతంతో ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
రూ.1,47,760 జీతంతో ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
బాత్రూంలో ఉప్పు పెడితే డబ్బులే డబ్బులు..వాస్తు శాస్త్ర రహస్యాలివే
బాత్రూంలో ఉప్పు పెడితే డబ్బులే డబ్బులు..వాస్తు శాస్త్ర రహస్యాలివే
బ్రోకలీ కర్రీ ఇలా చేస్తే.. తస్సాదియ్యా.. ఏ మాంసం కూరలు సరిపోవు
బ్రోకలీ కర్రీ ఇలా చేస్తే.. తస్సాదియ్యా.. ఏ మాంసం కూరలు సరిపోవు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అప్పటిలోపు చెల్లించిన వారికే 90% మాఫీ
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అప్పటిలోపు చెల్లించిన వారికే 90% మాఫీ
బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!
బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!