Vijay Hazare Trophy: అరుదైన ఘనత సాధించిన ముంబయి చిచ్చరపిడుగు పృథ్వీషా.. హేమా హేమీలకు సాధ్యం కానీ రికార్డును..
Vijay Hazare Trophy Final: దేశీవాళీ వన్డే టోర్నీలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు భారత ఓపెన్ పృథ్వీషా. ఆకాశమే హద్దులా దూసుకెళుతోన్న ఈ యంగ్ బ్యాట్స్‌మన్ తాజాగా..
Vijay Hazare Trophy Final: దేశీవాళీ వన్డే టోర్నీలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు భారత ఓపెన్ పృథ్వీషా. ఆకాశమే హద్దులా దూసుకెళుతోన్న ఈ యంగ్ బ్యాట్స్‌మన్ తాజాగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగాడు. ఇప్పటికే ఈ ట్రోఫీలో 4 భారీ సెంచరీలు నమోదు చేసిన పృథ్వీ ఫైనల్లోనూ రెచ్చిపోయాడు. ఉత్తరప్రదేశ్ జట్టుతో ఢిల్లీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 39 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్తరప్రదేశ్ ఇచ్చిన 313 పరుగుల లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ముంబయి చేధించింది. పృథ్వీ షా విజృంభణకు వికెట్ కీపర్ ఆదిత్య తారే సెంచరీ కూడా తోడుకావడంతో ముంబయి ఘన విజయం సాధించింది.
అరుదైన రికార్డు..
ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించిన పృథ్వీ షా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కోహ్లీ, ధోనీలాంటి హేమాహేమి ప్లేయర్స్‌కే సాధ్యం కానీ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 800కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. తాజాగా జరిగిన ఈ టోర్నీలో పృథ్వీ మొత్తం 827 పరుగులు నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఇదిలా ఉంటే ఇలా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న పృథ్వీ టీమిండియా జట్టులో సెలక్ట్ అవుతాడా? అన్న దానిపై అందరిలోనూ చర్చ మొదలైంది.
Also Read: India VS England 2nd T20: దెబ్బకు దెబ్బ తీసిన టీమిండియా… రెండో టీ20లో భారత్ ఘన విజయం..