MS Dhoni New Monk Avatar : ధోని సన్యాసి తీర్థం పుచ్చుకున్నాడా..! ఈ గెటప్ చూస్తే ఎవ్వరైనా అలాగే అంటారు.. సరికొత్త లుక్‌లో మహి..
MS Dhoni New Monk Avatar : టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గెటప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చానీయాంశమైంది. సన్యాసి గెటప్‌లో ఓ చెట్టు కొమ్మపై కూర్చున్న
MS Dhoni New Monk Avatar : టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గెటప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చానీయాంశమైంది. సన్యాసి గెటప్‌లో ఓ చెట్టు కొమ్మపై కూర్చున్న ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోనీ.. అక్కడ సీఎస్‌కే క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నెట్స్‌లో బౌలర్లని ఉతికారేస్తూ సిక్సర్ల వర్షం కురిపించిన ధోని అకస్మాత్తుగా ఇలా సన్యాసిగా మారిపోవడం ఏంటని నెటిజన్ల నోరెళ్లబెడుతున్నారు.
2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని తన హెయిర్ స్టైల్‌ను తీసేసి గుండు చేయించుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. అప్పటి వరకు ధోని హెయిర్ స్టైల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. వాస్తవానికి ధోని క్రికెట్‌లోకి వచ్చినప్పుడు అందరు అతని హెయిర్ గురించే మట్లాడేవారు. అతని ఫెర్మామెన్స్‌కి తోడు అందమైన హెయిర స్టైల్‌తో మైదానంలో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తే అభిమానులు ధోని.. ధోని అంటూ తమ వాయిస్ వినిపించేవారు.
గత ఏడాది ఐపీఎల్‌కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించాడు. ధోనీ సన్యాసి అవతారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యాడ్ షూటింగ్ కోసం ధోనీ ఆ వేషం వేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. సన్యాసి అవతారంలో లేకపోయినా.. ధోనీ ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటాడని మరికొందరు చెబుతున్నారు.
??? – our faces since we saw #MSDhoni‘s new avatar that could just break the Internet! ?What do you think is it about? pic.twitter.com/Mx27w3uqQh
— Star Sports (@StarSportsIndia) March 13, 2021