ఆ క్యాచ్ పట్టుంటే… ఫలితం వేరేలా ఉండేది – ట్రెంట్ బౌల్ట్

ఆక్లాండ్: న్యూజిలాండ్, ఆతిధ్య ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ 2019 ఫైనల్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్లను విజయం దోబూచులాడగా అభిమానులు మాత్రం అసలు సిసలు మజాను ఆస్వాదించారు. సూపర్ ఓవర్‌ వరకూ వచ్చిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌండరీ కౌంట్ ఆధారంగా విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈ రూల్‌తో ఫైనల్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉందని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన […]

ఆ క్యాచ్ పట్టుంటే... ఫలితం వేరేలా ఉండేది - ట్రెంట్ బౌల్ట్
Follow us
Ravi Kiran

| Edited By: Srinu

Updated on: Jul 19, 2019 | 5:26 PM

ఆక్లాండ్: న్యూజిలాండ్, ఆతిధ్య ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ 2019 ఫైనల్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్లను విజయం దోబూచులాడగా అభిమానులు మాత్రం అసలు సిసలు మజాను ఆస్వాదించారు. సూపర్ ఓవర్‌ వరకూ వచ్చిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌండరీ కౌంట్ ఆధారంగా విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈ రూల్‌తో ఫైనల్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉందని న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ప్రపంచకప్ ముగిసిన అనంతరం స్వదేశానికి చేరుకున్న బౌల్ట్.. తొలిసారి ఫైనల్ ఓటమి గురించి మీడియాతో పంచుకున్నాడు. బౌండరీ కౌంట్ ఆధారంగా ఓడిపోవడం మమ్మల్ని కలచివేసిందని.. ఈ విషయాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేమని చెప్పాడు. బౌల్ట్ మాట్లాడుతూ “దాదాపు నాలుగు నెలల తర్వాత నేను ఇంటికి వెళ్తున్నాను. నా పెంపుడు కుక్కతో కలిసి బీచ్‌లో వాకింగ్‌కి వెళ్తా. ఫైనల్‌లో 49 ఓవర్‌లో నేను.. బెన్‌ స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను పట్టి బౌండరీని తాకిన విషయాన్ని మర్చిపోడానికి చాలా ప్రయత్నిస్తాను” అని తన బాధను వ్యక్తం చేశాడు.

ఒకవేళ ఆ క్యాచ్‌ను నేను సరిగ్గా పట్టుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని.. నేను వేసిన ఆఖరి ఓవర్ కూడా పదేపదే గుర్తొస్తుందని బౌల్ట్ అన్నాడు. ఆఖరి ఓవర్‌లో స్టోక్స్.. సిక్స్ కొట్టడం, ఇంగ్లాండ్‌కు అనుకోని విధంగా పరుగులు రావడం.. అన్ని విచిత్రంగా జరిగాయని అతడు వెల్లడించాడు.

నిజానికి ప్రపంచకప్ తమకు దక్కాలి.. కానీ ఇంగ్లాండ్‌కు వరించింది. 2015 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన దానికంటే.. ఈ ఫైనల్‌లో జరిగిన కొన్ని పరిణామాలు మమల్ని ఎంతో బాధించాయని ట్రెంట్ బౌల్ట్ స్పష్టం చేశాడు.