చోటు ఎవరికి దక్కుతుందో..? జూలై 21న భారత్ జట్టు ఎంపిక!

ముంబై: విండీస్ పర్యటనకు వెళ్లే భారత్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈనెల 21న ఎంపిక చేయనుంది. ఆదివారం ముంబైలో జరిగే సమావేశం తర్వాత సెలెక్టర్లు జట్టు సభ్యులను ప్రకటించనున్నారు. ముఖ్యంగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపిక‌పై సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ పర్యటనకు యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలనీ సెలెక్టర్లు ఇదివరకే నిర్ణయించారు. జట్టు భవిష్యత్తు, వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని […]

చోటు ఎవరికి దక్కుతుందో..? జూలై 21న భారత్ జట్టు ఎంపిక!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 19, 2019 | 7:18 PM

ముంబై: విండీస్ పర్యటనకు వెళ్లే భారత్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈనెల 21న ఎంపిక చేయనుంది. ఆదివారం ముంబైలో జరిగే సమావేశం తర్వాత సెలెక్టర్లు జట్టు సభ్యులను ప్రకటించనున్నారు. ముఖ్యంగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపిక‌పై సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ పర్యటనకు యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలనీ సెలెక్టర్లు ఇదివరకే నిర్ణయించారు. జట్టు భవిష్యత్తు, వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. అటు విరాట్ కోహ్లీ కూడా విశ్రాంతి అవసరం లేదని.. విండీస్ టూర్‌కు వెళ్తానని అనడంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఆగష్టు 3 నుంచి మొదలయ్యే ఈ టూర్‌లో భారత్.. విండీస్ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ సిరీస్‌ల కోసం జట్లను ఎంపిక చేయనుంది.