AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics: అనుకున్నదే జరిగింది.. జపాన్‌లో ఎమర్జెన్సీ.. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్!

అనుకున్నదే జరిగింది. ఒలింపిక్స్ ముందు జపాన్‌లో ఎమర్జెన్సీని విధించింది అక్కడి ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ప్రధానమంత్రి యొషిహిదె సుగా ప్రకటించారు.

Tokyo Olympics: అనుకున్నదే జరిగింది.. జపాన్‌లో ఎమర్జెన్సీ.. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్!
Covid 19 In Tokyo Olympics
Venkata Chari
|

Updated on: Jul 20, 2021 | 11:58 AM

Share

Tokyo Olympics: అనుకున్నదే జరిగింది. ఒలింపిక్స్ ముందు జపాన్‌లో ఎమర్జెన్సీని విధించింది అక్కడి ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ప్రధానమంత్రి యొషిహిదె సుగా ప్రకటించారు. మరో 14 రోజుల్లో టోక్యో వేదికగా అంతర్జాతీయ క్రీడా పండుగ ప్రారంభంకాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ ఈ నెల 12 నుంచి ఆగస్టు 22 వరకు ఉంటుందని వెల్లడించారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్‌ పూర్తిగా ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్యనే జరుగుతాయని తెలిపారు. అలాగే ఆగస్టు 24న పారా ఒలింపిక్స్‌ మొదలుకానున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో జపాన్‌లో బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందన్నారు. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు టీవీల్లోనే ఒలింపిక్స్ చూడాలని కోరింది. మొన్నటి వరకు కూడా రోజుకు 10,000 మందిని స్టేడియాలకు అనుమతిస్తామని చెప్పిన ప్రభుత్వం.. గత నెల రోజులుగా అక్కడ పాజిటివ్ కేసులు భయంకరంగా పెరుగుతుండడంతో.. ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం మొగ్గుచూపింది. కాగా, గురువారం టోక్యోలో 896 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఒలింపిక్ విలేజ్ లోనూ రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌ టోక్యో చేరుకున్నాడు. విమానాశ్రయం నుంచి నేరుగా ఐఓసీ క్రీడల సెంట్రల్ ఆఫీస్‌కు చేరుకున్నాడు. మూడు రోజుల పాటు ఆయన ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో స్టేడియాలు ఖాళీగానే కనింపించనున్నాయి. ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించనున్నారు. ‘‘డెల్టా స్ట్రెయిన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వైరస్‌ నివారణ చర్యలు మరింత వేగం చేయాలి. అభిమానులు లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం’’ అని జపాన్‌ ప్రధాని సుగా తెలిపారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. అయితే, ఇప్పటికే వీరి పేర్లను భారత ఒలింపిక్స్ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి ఎప్పుడు జపాన్ బయలుదేరేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ విషయంలో అథ్లెట్లు కూడా సమాచారం లేదు. కాగా, వీరి ప్రయాణానికి సంబంధించిన డేట్స్ విషయంలో ఐఓఏ నుంచి వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది. దీంతో ఎప్పుడు బయలుదేరేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మూడు రోజుల క్రితం ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా వెల్లడించిన వివరాల మేరకు.. అథ్లెట్ల ఫస్ట్ బ్యాచ్ 17న టోక్యో బయలుదేరుతుందని తెలిపారు. కానీ, టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ ఇంకా రాలేదని, అది ఓకే అయితే 14 నే బయలు దేరనున్నట్లు అథ్లెట్లకు సమచారం అందింది.

Also Read:

Wimbledon 2021: మహిళల సింగిల్స్ లో కొత్త ఛాంపియన్‌కే అవకాశం.. ఫైనల్ చేరిన ఆష్లే బార్టీ, ప్లిస్కోవా!

బౌలర్ అవతారం ఎత్తిన బ్యాట్స్‌మెన్.. మొదటి టెస్టులో 6 వికెట్లు తీసినా గంగూలీకి నచ్చలేదు.. 3 టెస్టులు, 5 వన్డేలతో రిటైర్మెంట్..!

278 బంతులు.. 37 పరుగులు.. మరో రాహుల్ ద్రవిడ్ ఈ బ్యాట్స్‌మెన్..! అతడెవరంటే..?