AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బౌలర్ అవతారం ఎత్తిన బ్యాట్స్‌మెన్.. మొదటి టెస్టులో 6 వికెట్లు తీసినా గంగూలీకి నచ్చలేదు.. 3 టెస్టులు, 5 వన్డేలతో రిటైర్మెంట్..!

హర్భజన్ కంటే ముందు టీమిండియాలో మెరిసిన ఓ ఆటగాడు.. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి మొదటి బ్యాచ్‌లో ఎంపికైన అతికొద్ది ఆటగాళ్లలో అతను ఒకడు.

బౌలర్ అవతారం ఎత్తిన బ్యాట్స్‌మెన్.. మొదటి టెస్టులో 6 వికెట్లు తీసినా గంగూలీకి నచ్చలేదు.. 3 టెస్టులు, 5 వన్డేలతో రిటైర్మెంట్..!
Sharandeep Singh
Venkata Chari
|

Updated on: Jul 08, 2021 | 10:48 PM

Share

హర్భజన్ కంటే ముందు టీమిండియాలో మెరిసిన ఓ ఆటగాడు.. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి మొదటి బ్యాచ్‌లో ఎంపికైన అతికొద్ది ఆటగాళ్లలో అతను ఒకడు. ఎరపల్లి ప్రసన్న, వెంకటరాఘవన్ వంటి వారి నుంచి స్పిన్ బౌలింగ్‌లోని నైపుణ్యాలను ఒంటబట్టించుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో భారత జట్టులో చోటు సంపాదించిన తరువాత , జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో వరుసగా నాలుగు మెయిడిన్లు వేసి కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆ తరువాత ఈ మ్యాచ్‌లో మొత్తం 6 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. కానీ, తన కెరీర్ మొత్తంలో కేవలం 3 టెస్టులు, 5 వన్డేలు మాత్రమే ఆడాడు. 2001లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడాల్సి ఉంది. కానీ, సౌరభ్ గంగూలీ మరో స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను తీసుకోవడంతో.. అతనికి టీమిండియాలో ద్వారాలు మూసుకపోయాయి. ఈ సిరీస్‌లో హర్భజన్ సింగ్ 3 టెస్టులు ఆడి 32 వికెట్లు పడగొట్టడంతో.. ఇక ఆ ప్లేయర్‌కు టీమిండియాలో స్థానం కష్టంగా మారింది. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా.. మాజీ స్పిన్నర్ శరణ్ దీప్ సింగ్.

శరణ్ దీప్ సింగ్ 2000సంవత్సరంలో జింబాబ్వే తో జరిగిన నాగ్‌పూర్ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే మొదటి నుంచి ఈ ప్లేయర్‌పై గంగూలీకి ఎందుకో మంచి నమ్మకం లేకపోయింది. చాలా సేపటి వరకు శరణ్ దీప్ సింగ్ కు బౌలింగ్ కు దించలేదు. చివరికి జింబాబ్వే జట్టు 40 ఓవర్లు ఆడి 150 పరుగులు సాధించింది. ఈ టైంలో గంగూలీ బాల్‌ను శరణ్ దీప్ సింగ్ చేతికి ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కాంప్ బెల్, గై వీటిల్ వికెట్లు పడగొట్టాడు. దాంతో జింబాబ్వే జట్టు ఫాలో ఆన్ ఆడింది. కానీ, రెండవ ఇన్నింగ్స్‌లో ఆండీ ఫ్లవర్ డబుల్ సెంచరీ చేసి ఈమ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లకు 6 వికెట్లు దక్కాయి. ఇందులో శరణ్ దీప్ సింగ్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. కెరీర్ బాగానే మొదలైంది.

మొదటి టెస్టు ఆడిన సంవత్సరం తరువాత రెండవ టెస్టు ఆడాల్సి వచ్చింది. 2001లో ఇంగ్లండ్‌పై మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం మరో సంవత్సరం తరువాత మూడవ టెస్టు ఆడాడు. జార్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. దీని తరువాత మరో టెస్టులో చోటు దక్కలేదు. మొత్తం మూడు టెస్టుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, 2002లో ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మెట్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన శరణ‌్ దీప్ సింగ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక 2001 లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రత్మక టెస్ట్ సిరీస్‌ లో ఎంపిక కాలేదు. కెప్టెన్ గంగూలీ.. హర్భజన్ సింగ్ ను ఎంచుకున్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో హర్భజన్ హ్యాట్రిక్‌తోపాటు 32 వికెట్లు పడగొట్టడంతో టెస్ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది.

శరణ్ దీప్ సింగ్ జూనియర్ స్థాయిలో బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు.. శరణ్ దీప్ సింగ్ జూనియర్ స్థాయిలో బ్యాట్స్‌మెన్‌గా ఆడేవాడు. అతను 1998-99 సీజన్‌లో పంజాబ్ టీం తరపున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌తోనే ఆఫ్ స్పిన్నర్‌గా తనను తాను మలచుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శరణ్ దీప్ 8 వికెట్లు తీసి సత్తాచాటి, మొదటి సారి తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం 1999-2000లో తన రెండవ ఫస్ట్ క్లాస్ సీజన్‌లో, రంజీ ట్రోఫీలో 37 వికెట్లు పడగొట్టాడు. దీని తరువాత 2000 సంవత్సరం మే నెలలో ఎన్‌సీఏ మొదటి బ్యాచ్‌లోకి ఎంపికయ్యాడు. ఇక్కడ అతని బౌలింగ్ మెరుగుపరుచుకున్నాడు. అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్‌ల హవాతో శరణ్ దీప్ సింగ్‌కు అవకాశాలు రాలేదు. చివరికి 2010లో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

Also Read:

Tokyo Olympics 2020: ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం.. ఎమర్జెన్సీ దిశగా జపాన్ ప్రభుత్వం..!

278 బంతులు.. 37 పరుగులు.. మరో రాహుల్ ద్రవిడ్ ఈ బ్యాట్స్‌మెన్..! అతడెవరంటే..?