Tokyo Olympics 2020: ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం.. ఎమర్జెన్సీ దిశగా జపాన్ ప్రభుత్వం..!
గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఈక్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి ఈ పోటీలకు దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు.
Tokyo Olympics 2020: గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఈక్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి ఈ పోటీలకు దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. అయితే, ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఆందోళన కలిగిస్తోంది. టోక్యోలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టోక్యో చేరుకున్న కొంతమంది అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌గా రావడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతోపాటు జపాన్ ప్రభుత్వం హైరానా పడుతోందంట. ఈమేరకు మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. జులై 23 కు వారం రోజుల ముందు నుంచి ప్రపంచవ్యాప్తంగా వేలాది అథ్లెట్లు టోక్యో చేరుకోనున్నారు. ఇప్పటివకే ఒలింపిక్ విలేజ్ లో రెండు కరోనా కేసులు నమోదవడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
జపాన్ ప్రభుత్వం గతేడాది నుంచి అక్కడ ఎమర్జెన్సీ ని విధిస్తూ వచ్చింది. కానీ, ఒలింపిక్స్ పనుల కోసం గత నెల 21 న ఎమర్జెన్సీని తొలగించింది. దీంతో అక్కడ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వైద్య సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఒలింపిక్స్ ను నిర్వహించకూడదని పేర్కొంటున్నాయి. టోక్యోలో రోజుకి సగటున 920 కేసులు నమోదవ్వడంతో వీటికి బలం చేకూరినట్లైంది. కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహించిన తీరుతామని జపాన్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈమేరకు రానున్న రోజుల్లో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేసేందుకు జపాన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ ముగిసే వరకూ మరలా ఎమర్జెన్సీని పునరుద్ధరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లకు పలు కఠిన నియమాలు ప్రకటించిన జపాన్ ప్రభుత్వం.. ప్రేక్షకులకు కూడా అమలు చేయనుంది. అయితే, ప్రతిరోజు 10,000 మందిని స్టేడియంలోకి అనుమతించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే సూచనలు కనిపిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Also Read:
278 బంతులు.. 37 పరుగులు.. మరో రాహుల్ ద్రవిడ్ ఈ బ్యాట్స్‌మెన్..! అతడెవరంటే..?
India vs Srilanka: యువ ఆటగాళ్లకు కీలకం.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటుతోన్న ప్లేయర్స్!
MS Dhoni – CSK: సీఎస్కే ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లు కెప్టెన్‌గా మహేంద్రుడే..!