AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Men In Blue: హాకీ టీమ్ సభ్యులకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా.. ఎంత మంది పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే..

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఇప్పటికే దేశ ప్రధాని మోడీ.. దేశానికి మీరు గర్వకారణం.. యువతకు ఆదర్శం..

Men In Blue: హాకీ టీమ్ సభ్యులకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా.. ఎంత మంది పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే..
Punjab Players
Surya Kala
|

Updated on: Aug 05, 2021 | 1:33 PM

Share

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టుపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఇప్పటికే దేశ ప్రధాని మోడీ.. దేశానికి మీరు గర్వకారణం.. యువతకు ఆదర్శం అంటూ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా పంజాబ్ ప్రభుత్వం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన జట్టు పై ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి ట్విట్టర్ వేదికా పొగిడారు. అంతేకాదు హాకీ జట్టులో ఉన్న పంజాబ్ ఆటగాళ్లకు నగదు బహుమతిని ప్రకటించారు. కాంస్య పతకం సాధించడానికి భారత హాకీ పురుషుల జట్టులో భాగమైన ప్రతి పంజాబీ క్రీడాకారుడికి కోటి రూపాయల నగదు పురష్కారాన్ని స్తున్నామని ప్రకటించారు.

ఈ రోజు భారత హాకీ చరిత్రలో గొప్ప రోజు… నగదుని అవార్డు గా ప్రకటించడం ఆనందం కలిగించిందని తెలిపారు. పతకం సాధించిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక భారత పురుషుల హాకీ జట్టులో పంజాబ్ నుంచి కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సహా ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు.

కెప్టెన్ మం ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, హార్దిక్ సింగ్, షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, మన్ దీప్ సింగ్ లు దేశం తరపున హాకీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిస్తే.. ఇప్పటికే తమ రాష్ట్రనుంచి ఒలింపిక్స్ హాకీ జట్టులో పాల్గొన్న జట్టులోని సభ్యులకు ఒకొక్కరికి రూ.2.25 కోట్లు నగదు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

1980 లో మాస్కోలో జరిగిన విశ్వక్రీడ పోటీల్లో హాకీలో భారతదేశం ఒలింపిక్ పతకాన్ని సాధించింది.మళ్ళీ ఇప్పటికి కాంస్యం తో ఒలింపిక్స్ లో మన పతాకం ఎగురవేసింది. దీంతో మొత్తం టోక్యో ఒలింపిక్స్ లోని భారత హాకీ జట్టు ప్రదర్శన తనను ఆకట్టుకుందని.. తాను గర్వపడుతున్నాని మంత్రి సోధి చెప్పారు. “చారిత్రాత్మక విజయాన్ని ఆస్వాదించడం.. సంబరాలు జరుపుకోవడానికి ఇదే సరైన సమయం. పంజాబ్ క్రీడా మంత్రిగా, జాతీయ క్రీడను ప్రోత్సహించడం.. దేశ జెండా మోసేవారిని ప్రోత్సహించడం నా విధి అది నాకు గర్వకారణం” అని సోధి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా భారత జట్టు కు అభినందనలు తెలిపారు. 41 సంవత్సరాల తర్వాత పోడియంలో అద్భుత విజయం సాధించి కాంస్యం సాధించిన భారత జట్టుకు అభినందనలు “అని అమరీందర్ ట్వీట్ చేశారు.

Also Read: Jurala Project: జూరాల ప్రాజెక్ట్‌కు జలకళ .. మొదలైన పర్యాటకుల సందడి.. ఊరిస్తున్న చేపల వంటకాలు