Mirabai Chanu: మీరాబాయికి బంపరాఫర్‌.. ఇకపై జీవితాంతం ఉచితంగా సినిమా చూడొచ్చు..

Mirabai Chanu: ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్స్‌ గేమ్స్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గేమ్స్‌ను చాలా దేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇక ప్లేయర్స్‌కు ఇవి...

Mirabai Chanu: మీరాబాయికి బంపరాఫర్‌.. ఇకపై జీవితాంతం ఉచితంగా సినిమా చూడొచ్చు..
Mirabai Chanu
Follow us

|

Updated on: Jul 29, 2021 | 11:58 AM

Mirabai Chanu: ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్స్‌ గేమ్స్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గేమ్స్‌ను చాలా దేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇక ప్లేయర్స్‌కు ఇవి ఎంత ముఖ్యమైనవో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించడం ప్రతీ క్రీడాకారుడికి ఒక కలలాంటిది. దీనికోసమే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే ఒక్కసారి ఈ పతకాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇకపై జీవితంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. యావత్‌ దేశం వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది.

ఇటీవల భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఇండియాకు సిల్వర్‌ మెడల్‌ సాధించి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో మీరాపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం ప్రశంసలకే పరిమితం కాకుండా నగదు బహుమతులు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే రైల్వే శాఖ రూ. 2 కోట్లు, మ‌ణిపూర్ ప్రభుత్వం కోటి రూపాయల నజరాన ప్రకటించాయి. ఇక ప్రైవేటు కంపెనీలు సైతం మీరబాయి ప్రతిభకు పట్టం పడుతున్నాయి. డొమినాస్‌ ఇప్పటికే మీరాబాయికి జీవితాంతం ఉచితంగా పిజ్జాలు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ వచ్చింది. ఇకపై మీరాబాయి జీవితకాలం ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తామని ఐనాక్స్ లీజ‌ర్ లిమిటెడ్‌ ప్రకటించింది. ఒక్క మీరాబాయికే కాకుండా.. ఈ ఒలింపిక్స్‌లో మెడ‌ల్‌తో దేశానికి వచ్చే ప్రతీ ఒక్క ప్లేయర్‌కు ఈ ఆఫర్‌ అందిస్తామని స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా గెలుపోటములతో సంబంధం లేకుండా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ప్రతి అథ్లెట్‌కు ఏడాదిపాటు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామని ఐనాక్స్‌ ప్రకటించడం విశేషం.

Also Read: Viral Photo: అంతరిక్షం నుంచి ఒలింపిక్ వెలుగులు.. నెట్టింట్లో వైరలవుతోన్న నాసా ఫొటో

Sachin Tendulkar: మరోసారి మంచిమనసు చాటుకున్న సచిన్.. పేద రైతు కూతురు డాక్టర్ చదవడానికి అండగా..

Tokyo Olympics 2020: హ్యాట్రిక్‌ విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత స్టార్ షట్లర్.. డెన్మార్క్ ప్లేయర్‌పై 40 నిమిషాల్లోనే..